»   » పూరి జగన్నాథ్ కొత్త చిత్రం ‘రోగ్‌’..ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో

పూరి జగన్నాథ్ కొత్త చిత్రం ‘రోగ్‌’..ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'రోగ్‌' అనే చిత్రం రూపుదిద్దుకుంటోన్న మనందరికీ విషయం తెలిసిందే. ఇషాన్‌ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్‌ అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేశారు.

ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేమ కోసం తలకిందులుగా వేలాడే ప్రేమికులకు శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు. పోస్టర్‌లో హీరో తలకిందులుగా వేలాడుతున్నారు. 'రోగ్‌' అనే టైటిల్‌ ఉన్న ఈ చిత్రానికి మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు.

సునీల్‌ కశ్యప్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి సినిమా విడుదల చేసే దర్శకుడు పూరి జగన్నాథ్‌. అయితే ఆయన తెరకెక్కించిన 'రోగ్‌' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం గడిచినా విడుదలకు నోచుకోలేదు.

Puri Jagannadh ROGUE Movie First Look

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పూరియే తెలిపారు... ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసారు. ఈ సినిమాను ఇప్పటికే పూరి సన్నిహితులకు చూపించినట్టు టాక్‌.

ఈ సినిమా పూరి బ్లాక్ బస్టర్ 'ఇడియట్' ను గుర్తు చేసిందని... కొత్తగా పరిచయమవుతున్న ఇషాన్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ మేనల్లుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన ఈ సినిమా వేసవి విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సిఆర్ మనోహర్...తెలుగు హీరో శ్రీకాంత్ కు సన్నిహిత మిత్రుడు. శ్రీకాంత్ తో ఆయన గతంలో మహాత్మ చిత్రం నిర్మించారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కు ఆయన భారీ రెమ్యునేషన్ ఇచ్చి మరీ తన మేనల్లుడుని హీరోగా ఇచ్చాడని చెప్తున్నారు.

English summary
Here’s the first look poster of Puri Jagannadh’s next “Rogue.” The film marks the debut of newcomer Ishaan, brother of Kannada producer C.R. Manohar. “Maro Chantigadi Prema Kadha”is the film’s tagline. The film is being made in Telugu and Kannada simultaneously.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu