»   » ఫోర్న్ నిషేధం: నరేంద్ర మోదీకు పూరి జగన్నాథ్ ఇలా...

ఫోర్న్ నిషేధం: నరేంద్ర మోదీకు పూరి జగన్నాథ్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా నలుగుతున్న పోర్న్ మీద బ్యాన్ పై రామ్ గోపాల్ వర్మ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ నోరు విప్పారు. ఆయన నరేంద్రమోదీ ని ఉద్దేశిస్తూ...ఇలా అన్నారు..

"నరేంద్రమోదీ గారూ... నేను మీ గవర్నమెంట్ నిర్ణయాన్ని గౌరవిస్తాను...మీరు ఆల్కహాల్,సిగరెట్ మీద కూడా బ్యాన్ పెడితే..యువత కోసం.. !!!" అన్నారు.

అలాగే ఫేస్ బుక్ లో ఇలా షేర్ చేసారు.

If so called government really worries abut PORN how come dey never protected youth Frm alcohol n cigarettes since 65...

Posted by Puri Jagannadh on 3 August 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక పూరి తాజా చిత్రం విషయానికి వస్తే...
పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో "లోఫర్" చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం రాజస్ధాన్ లోని జోధాపూర్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసి వచ్చింది. అతను మరెవరో కాదు...చంద్రదీప్ సురనేని..పటాస్, జిల్లా చిత్రాలల్లో విలన్ గా చేసారు. ఈ చిత్రం ద్వారా తనకు బ్రేక్ వస్తుందని చంద్రదీప్ భావిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ ..గబ్బర్ సింగ్ 2 లోనూ చేస్తున్నారు.

వరుణ్ తేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా కంచె టైటిల్ తో చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

Puri Jagannadh's Direct Appeal To PM Narendra Modi

‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

English summary
puri Jagannadh took to twitter last night to share his views on Porn Ban and has directly quoted his opinion to PM Narendra Modi. "narendramodi I 'll respect government if dey ban alcohol n cigarettes too in d country for d care of youth !!!", He mentioned to Modi.
Please Wait while comments are loading...