twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థాంక్స్ చెప్పాడు... కానీ పూరీ జగన్నాథ్ మారిపోయాడు

    రోగ్ సినిమా సక్సెస్ మీట్ లో రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్ గా రాసి మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ నా థ్యాంక్స్ అని పూరి అన్నాడు.

    |

    కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయగలిగే దర్శకుడు పూరీ జగన్నాథ్. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో పనిచేసిన పూరీ తన రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాడనే చెప్పాలి. టెంపర్ తర్వాత సరైన హిట్ కోసం తపిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజమ్ లాంటి చిత్రాలొచ్చినా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసుకోలేకపోయాయి. దీంతో పూరీ పని అయిపోయిందనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో 'రోగ్‌'తో మళ్లీ తన మార్కు సినిమా తీసి అందర్నీ మెప్పించాలనుకున్నాడు.

    మరో చంటిగాడి ప్రేమకథ

    మరో చంటిగాడి ప్రేమకథ

    అందుకే తన కెరీర్లోనే మైలు రాయిగా నిలిచి పోయే సినిమా ఇడియట్ ని గుర్తుకు తెచ్చేలా " మరో చంటిగాడి ప్రేమకథ" అని ట్యాగ్ లైన్ అతికించాడు. ఇప్పుటివరకు ఆయన తెరకెక్కించి చిత్రాలతో కలిపి దీన్ని తెరకెక్కించినట్టు కనిస్తోంది. రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న దర్శకుడు, మరోసారి రోగ్ విషయంలోనూ అదే స్టైల్‌ని ఫాలో అయ్యాడు.

    చప్పరించేసారు విమర్శకులు

    చప్పరించేసారు విమర్శకులు

    అక్కడక్కడా పూరి డైలాగ్స్‌లో తన మార్క్ చూపించినా, ఓవరాల్‌గా స్టైల్, టేకింగ్ రొటీన్గానే ఉందీ అంటూ చప్పరించేసారు విమర్శకులు... ప్రేక్షకులు కూడా... అయితే పూరీ చెప్పిన మాటలు మాత్రం వింతగా ఉన్నాయి... ఇదివరకెప్పుడూ ఫాల్స్ ప్రచారం చేసుకోని పూరీ ఈసారి తన సినిమా యావరేజ్ అని అర్థం అయ్యాక కూడా సూపడూపర్ హిట్ అన్నంత బిల్డప్ ఇవ్వటం ఒకింత వింతగానే కనిపించింది.

    అందరికీ నా థ్యాంక్స్

    అందరికీ నా థ్యాంక్స్

    ఇంతకీ పూరీ ఏం చెప్పాడో అతని మాటల్లోనే వింటే .... మా ‘రోగ్' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇటు తెలుగులో.. అటు కన్నడలో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్ గా రాసి మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ నా థ్యాంక్స్.

    చాలా ఎంజాయ్ చేశాం

    చాలా ఎంజాయ్ చేశాం

    మా టీం అంతా కొన్ని ధియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల మధ్య చూశాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాం. ఇషాన్ కు చాలా మంచి పేరు వచ్చింది. రెండు మూడు సినిమాలు చేసిన హీరోకి ఎంత పేరు వస్తుందో ఇషాన్ తొలి సినిమాకే అంత పేరు కొట్టేశాడు.

    వందల మెసేజెస్ వస్తున్నాయి

    వందల మెసేజెస్ వస్తున్నాయి

    ఇషాన్ చాలా బాగున్నాడని.. మంచి హీరోను పరిచయం చేశారని నాకు కొన్ని వందల మెసేజెస్ వస్తున్నాయి. మన్నారా.. ఏంజెలా కూడా బాగా చేశారు. మన్నారాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. టాలెంట్ ఉన్న కొత్త వాళ్లతో వర్క్ చేస్తుంటే నాకు చాలా కిక్కుగా ఉంటుంది. సినిమా అందరికీ నచ్చింది. ఈ రోజుకి కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లూ 90 శాతం ఫుల్ అయ్యాయి'' అని పూరి అన్నాడు.

    తన ఫెయిల్యూర్ని తాను ఒప్పుకునే వాడు

    తన ఫెయిల్యూర్ని తాను ఒప్పుకునే వాడు

    నిన్నా మొన్నటి వరకూ పూరీలో ఒక యూనిక్ గా అనిపించే విషయం కనిపించేది. ఎప్పుడూ తన ఫెయిల్యూర్ని తాను ఒప్పుకునే వాడు, ప్రమోషన్స్ లోకూడా ఎప్పుడూ తనగురించి తాను అతిగా చెప్పుకొని డబ్బా కొట్టుకున్న ఫీలింగ్ తెచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త మార్పు కనిపిస్తోంది. తానూ మామూలు గా బిజినెస్ టెక్నిక్స్ తెలుసుకోవటం మొదలు పెట్టాడంటున్నారు. రోగ్ సక్సెస్ మీట్ లో పూరీ ప్రసంగం విన్నవాళ్ళు...

    English summary
    Dashing director Puri Jagganadh Says thanks To Reviewers for Positive reports About His New Movie Rogue with Ishaan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X