twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్‌ఖైదా... వర్మ మావీ చూస్తే అంతే: పూరీ సంచలన ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను ఉద్దేశించి సంచలన కామెంట్ చేసారు. ఆల్ ఖైదా సంస్థ తన సభ్యులను '26/11 ఇండియాపై దాడి' సినిమా చూడటానికి అనుమతించదు, ఎందుకంటే ఈ సినిమా చూస్తే వాళ్లు తీవ్రవాదం నుంచి మానవతావాదంలోకి మారుతారు' అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసారు.

    మార్చి 1న రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన '26/11 ఇండియాపై దాడి' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో వర్మ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన పూరి జగన్నాథ్ తదితరులకు ఈ చిత్రం స్పెషల్ షో చూపించారు. అనంతరం వర్మ తన ట్విట్టర్లో స్పందిస్తూ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసారని, సంఘటనలోని ఎమోషన్స్‌ను వెండి తెరపై గొప్పగా ఆవిష్కరించారని పూరి జగన్నాథ్ వెల్లడించారు.

    ఇలాంటి సబ్జెక్టును ఎంచుకుని సినిమా తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కేవలం రామ్ గోపాల్ వర్మకే సొంతం. అదే విధంగా నానా పాటేకర్ పెర్ఫార్మెన్స్ ఇండియన్ సినిమా చరిత్రలోనే లెజెండరీ పెర్ఫార్మెన్స్. అతని నటనకు హాట్సాఫ్ అంటూ వ్యాఖ్యానించారు పూరి. ఐలవ్ యు అన్నా అంటూ నానా పాటేకర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

    దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై నవంబర్ 26, 2008న పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులు జరిపన ఘటన ఆధారంగా.... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ '26/11 ఇండియాపై దాడి' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.

    English summary
    "Still reeling in the patriotic hangover after watching the terrific emotional saga 'attacks of 26/11'. Who else on the Indian movie arena can dare to venture and narrate it to the levels of such emotional excellence ... but 'RGV'. Al-Qaeda will never let its members watch this movie for it will sure transform its terrorists into Humanitarians. Nana patekar at his peaks. Hats off to his legendary performance in the Indian cinema history. Love u nana." Puri Jagannath tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X