»   » మోసం చేసారు, ఇప్పటికీ అద్దె ఇంట్లో నే: పూరీ జగన్నాధ్

మోసం చేసారు, ఇప్పటికీ అద్దె ఇంట్లో నే: పూరీ జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా సినిమాలో ట్విస్ట్‌ లు ఉన్నట్లు...నా జీవితంలో కూడా ఎన్నో ట్విస్ట్ ‌లు! చాలా ఎదురుదెబ్బలు తిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఎవరినైనా నమ్మి బాధ్యతలు అప్పగిస్తే మోసం చేస్తున్నారు. పదేళ్లయ్యింది నేను దర్శకుడినై. కోట్లు సంపాదించాను. కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను అంటూ వాపోయారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్. తన నుంచి మంచి సినిమాలురాకపోవటానకి కారణం చెపుతూ...పై విధంగా స్పందించారు. అలాగే నేనేమన్నా అక్రమంగా సంపాదిస్తున్నానా? ప్రజలను మోసం చేసి డబ్బు ఆర్జించడం లేదుకదా? నేనొక్కడ్నే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను. ఇవన్నీ నాలోని క్రియేటివిటీపై ప్రభావం చూపించి మంచి సినిమా చేయలేకపోతున్నాను. నాకు తగిలే దెబ్బలు అలాంటివి మరి. అందుకే ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకోవాల్సి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పూరీ జగన్నాధ్ ఆర్దిక పరిస్ధతి బాగోలేదు..అప్పులు పాలై ఆఫీసు సైతం అమ్మేసారు అని వినపడుతున్న నేపధ్యంలో ఈ స్టేట్ మెంట్ కి ప్రాధాన్యత ఏర్పడింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu