»   » జగన్ డైరెక్షన్లో జూ ఎన్టీఆర్, అధికార ప్రకటన త్వరలో...!?

జగన్ డైరెక్షన్లో జూ ఎన్టీఆర్, అధికార ప్రకటన త్వరలో...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగన్ డైరెక్షన్లో జూ ఎన్టీఆర్ సినిమా యువ కథానాయకుడు జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఊసరవెల్లి' చిత్రంతో బాటు, బోయపాటి శ్రీను డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 'ఊసరవెల్లి' సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం హైదరాబాదు శివారులోని విజయా ఎలట్రికల్స్ లో దీని క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంచితే, వీటి తర్వాత చేయబోయే తన తదుపరి ప్రాజక్టుల గురించి జూ ఎన్టీఆర్ మరోపక్క డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు.

ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. తాజాగా జూ ఎన్టీఆర్, జగన్నాథ్ కలిసి ఈ సినిమా గురించి చర్చించుకున్నారు కూడా. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. గతంలో వీరి కాంబినేషన్లో 'ఆంధ్రావాలా' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే! ఇక మహేష్ తో చేయనున్న ది బిజినెస్ మ్యాన్ చిత్రం అనంతరం ఈ సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శక్తి ప్లాప్ అనంతరం ఎన్టీఆర్ కథలో విషయంలో చాలా జాగ్ర్తత్తలు తీసుకుని ఓకే చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి స్దాయి మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు.

English summary
Puri Jagannath is planning to do a film with Jr Ntr. Andhrawala, which was a combination of both was a big disaster in Tollywood. Soon a formal announcement will be made and fans are expecting a full length mass entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu