»   » బాలకృష్ణను చూసి వండర్ అయిపోయాను.. గర్వంగా ఉంది.. పూరీ

బాలకృష్ణను చూసి వండర్ అయిపోయాను.. గర్వంగా ఉంది.. పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్'. భవ్య క్రియేషన్స్ పతాకం పై వీ ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్‌లుక్, టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌కు మంచి స్పందన లభించింది. పోర్చుగల్‌లో సుదీర్ఘమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వచ్చిన చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్నది. అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది. ఈ నెల 28న 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్' ని విడుదల చేయనున్నారు.

బాలయ్య సినిమాతో హ్యాపీ..

బాలయ్య సినిమాతో హ్యాపీ..

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగానూ, గర్వంగానూ ఉంది. నా కెరీర్‌లోనే మరిచిపోలేనటువంటి చిత్రం అవుతుంది. బాలయ్యబాబు ఈ పాత్రలో లీనమై నటించిన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి అని అన్నారు.

Watch How Balakrishna Receive His Fans | Filmibeat Telugu
స్టంపర్ చూస్తే అర్థమవుతుంది..

స్టంపర్ చూస్తే అర్థమవుతుంది..

డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్‌లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో 28న విడుదలకానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్‌గా అందరూ విడుదల చేసే టీజర్, ట్రైలర్‌కి పూర్తి భిన్నంగా ఈ 'స్టంపర్' ఉంటుంది" అని పూరీ జగన్నాథ్ చెప్పారు.

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా చేసే

క్రేజీ కాంబినేషన్‌లో సినిమా చేసే

బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను. మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను మరోస్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈవారంతో ప్యాచ్‌వర్క్ పూర్తవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి అని నిర్మాత వీ ఆనంద ప్రసాద్ తెలిపారు.

కర్టన్ రైజర్ వీడియో ట్రెండింగ్..

కర్టన్ రైజర్ వీడియో ట్రెండింగ్..

పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ, తుది దశకు చేరుకుంటోంది. ఆడియో ఫంక్షన్ని త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘nbk 101 fever begins పేరుతో బాలకృష్ణ ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం. అది సోషల్ మీడియాలో ఇండియా లెవెల్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్నది అని ఆనంద ప్రసాద్ వెల్లడించారు.

కీలక పాత్రలో కబీర్ బేడీ..

కీలక పాత్రలో కబీర్ బేడీ..

ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు. శ్రీయ సరన్, ముస్కాన్ , కైరాదత్, అలీ, పృథ్వి, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

English summary
Paisa vasool, Puri Jagannath, Balakrishna's crazy Project getting ready. This movies stamper will be released on July 28th. In this occassion, Puri and producer V Ananda Prasad reveal about Balaiahs acting credits.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu