»   » బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిని అవుతా.. పూరీ జగన్నాథ్

బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిని అవుతా.. పూరీ జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నందమూరి నట సింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం పూరీ తనదైన మార్కుతో కొత్తగా సరికొత్తగా ప్రచారాస్త్రాలు ఎక్కుపెట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు, కన్వీనర్లతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, భవ్యక్రియేషన్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ నిర్వహించిన ఫ్యాన్స్‌మీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.

బాలకృష్ణతో పనిచేయడం..

బాలకృష్ణతో పనిచేయడం..

దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. కానీ, ఈ సినిమా చేసిన తర్వాత ఆయనతో సినిమా చేయడం ఎందుకింత ఆలస్యమైందని ఫీలవుతున్నా. ఆయనతో పనిచేసిన తర్వాత మీరంతా ఎందుకు అభిమానులు అయ్యారనేది అర్థమైంది అని అన్నారు.


Balakrishna's Paisa Vasool Stumper Release Date Confirmed
అభిమాన సంఘానికి అధ్యక్షుడిని అవుతా..

అభిమాన సంఘానికి అధ్యక్షుడిని అవుతా..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణగారికి అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుణ్ని అవుతా. అంతగా ఆయనకు నేను అభిమాని అయ్యాను. మళ్ళీ మళ్ళీ బాలకృష్ణగారితో కలసి పనిచేయాలనుకుంటున్నా. తప్పకుండా పనిచేస్తాను అని పూరీ జగన్నాథ్ అన్నారు.​


పైసా వసూల్ అద్భుతంగా వచ్చింది

పైసా వసూల్ అద్భుతంగా వచ్చింది

నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. "బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అదీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అభిమానులు కోరుకునే ‘పైసా వసూల్' లాంటి సినిమా తీసినందుకు మరింత సంతోషంగా ఉంది. బాలకృష్ణకు ఇది 101 సినిమా. ఈ చిత్రం అవుట్‌ఫుట్ అద్భుతంగా వచ్చింది అని వెల్లడించారు.


101 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

101 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

పైసా వసూల్ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో 101మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇవ్వాలని నిర్ణయించాము. బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్ల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులోనూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలనేది మా ఆలోచన అని ఆనంద్ ప్రసాద్ చెప్పారు.


వినూత్నంగా ప్రచారం..

వినూత్నంగా ప్రచారం..

ఈ సినిమా ట్రైలర్‌ను స్టంపర్‌ పేరుతో విడుదల చేసిన పూరీ జగన్నాథ్ అభిమానులను ఆకర్షించేందుకు ఈ చిత్ర ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని వైరైటీ ప్రోమోలను విడుదల చేసి ప్రచారం చేయబోతున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ అభిమానులకు స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నారు.English summary
Nandamoori Balakrishna, Director Puri Jagannath's crazy project is Paisa Vasool. Paisa Vasool is 101th film for Balakrishna. In thsi occassion, Puri Jagannath, Producer V Ananda Mohan met Balaiah Fans on Tuesday. In this meeting Puri said that.. If Balakrishna Fans association in Jublihills of Hyderabad.. I will be a president for that Fans association.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu