»   » పూరీ కొత్త చిత్రం'రోగ్‌' హీరో ఈ కుర్రాడే...! (ఫొటో)

పూరీ కొత్త చిత్రం'రోగ్‌' హీరో ఈ కుర్రాడే...! (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన తరువాత ప్రాజెక్టు టైటిల్‌తో సహా హీరోను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇషాన్‌ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ 'రోగ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇషాన్‌ ఫొటోను కూడా పూరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

గతంలో పూరి జగన్నాథ్...చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ని హీరోగా లాంచ్ చేస్తూ చిరుత చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఆయన డైరక్షన్ లో చేయాలని కొత్త కుర్రాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఆయనకు ఇప్పుడు కర్ణాటక నుంచి రెండు ఆఫర్స్ వచ్చాయి. ఇద్దరు హీరోలను లాంచ్ చేస్తున్నారు.

కర్ణాటకలోని గంగావతి ఏరియాకు చెందిన నిర్మాత సిఆర్ మనోహర్ మేనల్లుడు ఇషాన్ ని ఇప్పుడు లాంచ్ చేస్తూ నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Puri Jagannath Rogue title for Ishan

సిఆర్ మనోహర్...తెలుగు హీరో శ్రీకాంత్ కు సన్నిహిత మిత్రుడు. శ్రీకాంత్ తో ఆయన గతంలో మహాత్మ చిత్రం నిర్మించారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కు ఆయన భారీ రెమ్యునేషన్ ఇచ్చి మరీ తన మేనల్లుడుని హీరోగా ఇచ్చాడని చెప్తున్నారు.

English summary
purijagan new film that will be starting from November introduces Ishan, nephew of producer C R Manohar who hails from Gangavathi area in Karnataka.
Please Wait while comments are loading...