»   » ఆ పాత్రకు పూరి జగన్నాథ్‌ కరెక్ట్‌

ఆ పాత్రకు పూరి జగన్నాథ్‌ కరెక్ట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథలో కొంత సినీ నేపథ్యం ఉంటుంది. ఎవరైనా ప్రముఖ దర్శకునితో పాత్ర చేయిద్దామని గౌతమ్‌ మీనన్‌ చెప్పగానే, నేను పూరి జగన్నాథ్‌ పేరు సూచించాను. మాకు 'పోకిరి' లాంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన గొప్ప దర్శకుడాయన అంటోంది నిర్మాత మంజుల. నాగచైతన్య హీరోగా ఆమె నిర్మిస్తున్న 'ఏ మాయ చేసావె' చిత్రం మరో మూడు రోజుల్లో(26 వ తేది) రిలీజవుతోంది. ఇక పూరీ జగన్నాధ్ ని తమ చిత్రంలో ఇలా పాత్ర చేయాలని అడగ్గానే 'మీ కోసం చేస్తాను' అన్నారు. రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించినా గానీ చాలా ఉత్సాహవంతంగా ఉంటుందాయన పాత్ర. తన శైలికి తగ్గట్టుగా సంభాషణలు కూడా మలుచుకున్నారు అంటూ మెచ్చుకుంటోంది.

అలాగే 'ఏ మాయ చేసావె' చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందిందని...అమెరికాలో 25 రోజులు చిత్రీకరణ చేశామని విశేషాలు వివరించింది. గౌతమ్‌ మీనన్‌ శైలిలోనే ఈ చిత్రం ఉంటూ సాంగ్స్‌, ఫైట్స్‌ అన్నీ కొత్తగా చేసామని, ఇంటర్నేషనల్‌ కొరియోగ్రాఫర్స్‌ తో ఇందులో పాటలు చేయించామని చెప్తోంది. ఇక నాగచైతన్యకు ఈ చిత్రం మంచి టర్నింగ్‌ పాయింట్‌ అని నాగార్జునకున్న లేడీస్‌ ఫాలోయింగ్‌ అంతా ఈ సినిమాతో నాగచైతన్య వైపు టర్న్‌ అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసిందామె.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu