»   » పూరీ టైటిల్ ఇలా ఉందేమిటీ!? అసలేం ఆలోచిస్తున్నాడు... కోతులూ, మేకా అంటూ...

పూరీ టైటిల్ ఇలా ఉందేమిటీ!? అసలేం ఆలోచిస్తున్నాడు... కోతులూ, మేకా అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూడు కోతులు.. ఒక మేక.. ఇలాంటి సినిమా టైటిల్ వినటానికే నవ్వొచ్చేలా ఉంది. కాకపోతే సినిమా టైటిల్ గా దీనిని కన్సిడర్ చేయాలంటే మాత్రం.. ఇదేదో అల్లరి నరేష్ చేసే కొత్త కామెడీ సినిమా అనిపిస్తోంది.కానీ ఇది కామెడీనో కాదో ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే ఈ టైటిల్ ఎంచుకున్నది సూపర్ డైరెక్తర్ పూరీ జగన్నాద్. అయితే ఇటీవలి కాలంలో పూరీ సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేకపోయాయి. పెద్ద హీరోలు పూరీని కాస్త దూరం పెట్టారు. దీంతో పూరీ చిన్న హీరోలతో ఓ సినిమా చేసి పెద్ద హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం 'రోగ్‌' సినిమా పనులతో బిజీగా ఉన్న పూరీ తర్వాత ఓ చిన్న సినిమాను మొదలుపెడుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు 'మూడు కోతులు.. ఒక మేక' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాడు.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈమధ్య కాస్త రేసులో వెంకపడ్డట్టు కనిపించినా మళ్లీ తన సత్తా చాటేందుకు కొత్త సినిమాతో రాబోతున్నాడు. కళ్యాణ్ రాం ఇజం ఫ్లాప్ తో కాస్త ఢీలా పడ్డ పూరి బ్యాంకాక్ వెళ్లి కథ పూర్తి చేసుకుని వచ్చారు. ఇక సినిమా టైటిల్ గా ఈ వింత టైటిల్ ని తీసుకున్నాడట . సాధారణంగా తన సినిమాల టైటిల్స్ తో ఎట్రాక్ట్ చేసే పూరి ఎప్పుడు సీరియస్ టైటిల్స్ లేదా ఇడియట్, లోఫర్, రోగ్ అంటూ కాస్త వెరైటీ టైటిల్స్ కూడా వాడేశాడు.

Puri Jagannath Upcoming Movie Funny Title

తన సినిమాకు విభిన్నమైన టైటిల్‌ పెట్టడం పూరీకున్న మరో ప్రత్యేకత. ఇప్పుడు పూరీ రిజస్టర్‌ చేయించిన ఈ టైటిల్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇజమ్ విడుదల తరువాత తారక్ తో సినిమా చర్చల దశలో తిరస్కారానికి గురి కావటంతో పూరి కొంత విరామం తీసుకుని ఇప్పుడు ఈ 'మూడు కోతులు ఒక మేక' అనే టైటిల్ తో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ టైటిల్ ని బట్టి నాలుగు లీడ్ రోల్స్ చుట్టూ కథ తిరుగుతుంది అని అర్ధం అవుతుంది.

అయితే ఈ టైటిల్ తో పూరి స్టార్స్ తో సినిమా చేయబోతున్నాడా లేక ఫ్రెష్ యాక్టర్స్ తో చేయబోతున్నాడా అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పూరి ఈ టైటిల్ తో అప్రోచ్ అయితే స్టార్ హీరోస్ నుంచి తిరస్కారమే ఎదురు అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి అనే అభిప్రాయాలూ వినపడుతున్నాయి. ఆటో జానీ ని మళ్ళీ తెరపైకి తెస్తున్నాడనీ, యంగ్ టైగర్ తో సినిమా అనీ, మహేష్ ఓకే చెప్పాడనీ వార్తలైతే వచ్చాయి గానీ అవేవీ కార్య రూపం దాల్చలేదు. సొ ఇప్పుడు చిన్న హీరో తోనే పూరీ హిట్ కొట్టాలి మరి. కాస్టింగ్ ఫైనల్ చేసుకుని పూరి తనంతట తాను ప్రకటిస్తే తప్ప మూడు కోతులు ఒక మేక పై పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదు.

English summary
Now, Puri has registered yet another catchy title, ‘Moodu Kothulu.. Oka Meka’. Puri is planning to make this film with three young heroes. More details of the project will be revealed soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu