»   » ఎన్టీఆర్ చేతుల మీదుగా కళ్యాణ్ రామ్ చిత్రం లాంచ్ (ఫొటోలు)

ఎన్టీఆర్ చేతుల మీదుగా కళ్యాణ్ రామ్ చిత్రం లాంచ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం ఆరంభమైంది. చిత్రం షూటింగ్‌ ఏప్రిల్‌ 29 ఉదయం 9.50 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది.

హీరో కల్యాణ్‌రామ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తన కొత్త చిత్రం ఇవాళ ప్రారంభమైందని తెలిపారు.

తనను అభినందించిన తండ్రి హరికృష్ణ, బాబాయ్‌ రామకృష్ణ, తారక్‌, కొరటాల శివకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుందని, సరికొత్త స్టైల్ తో సాగుతుందని దర్శకుడు చెప్తున్నారు.

ఫొటోలు.. మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో

క్లాప్

క్లాప్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డా. ఎన్‌.టి. రామారావు చిత్ర పటంపై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కు యంగ్‌టైగర్‌ క్లాప్‌ కొట్టారు.

కెమెరా స్పిచ్చాన్

కెమెరా స్పిచ్చాన్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.

ఫస్ట్ షాట్ కు

ఫస్ట్ షాట్ కు

కొరటాల శివ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు.

పూజా కార్యక్రమాలు

పూజా కార్యక్రమాలు

సాహసరత్న నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ....

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ....

"రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వుంటూనే సరికొత్త స్టైల్‌లో సాగే కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో కొత్త కళ్యాణ్‌రామ్‌ని చూస్తారు. మే లోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి ఓ షెడ్యూల్‌ స్పెయిన్‌లో చేస్తాం. హీరోగా కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌ని మరింత పెంచే సినిమా అవుతుంది" అన్నారు.

హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ...

హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ...

"పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో మా స్వంత బేనర్‌లో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. జగన్‌గారు కథ చెప్పినప్పట్నుంచీ ఎంతో ఎగ్జైట్‌ అవుతున్నాను. నా కెరీర్‌కి ఇది మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది" అన్నారు.

హీరోయిన్ ...

హీరోయిన్ ...

నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన ఆదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది.

కీలకమైన పాత్ర

కీలకమైన పాత్ర

ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తారు. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ భారీ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ముఖేష్, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

విషెష్

విషెష్

ఈ సందర్బంగా వన్ ఇండియా తెలుగు ..దర్శకుడు పూరీ జగన్ కు, హీరో కల్యాణ్ రామ్ కు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Nandamuri Kalyanram’s latest film under Puri Jagannadh’s direction has been kick-started in style in Hyderabad just a while ago. NTR along with his Janatha Garage director Koratala Siva graced the muhurtham ceremony to bless the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu