twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ ఆ సినిమా చూడాలి

    By Staff
    |

    Luck By Chance
    పూరీ జగన్నాధ్ ఆ మధ్య రవితేజ హీరోగా సినీ పరిశ్రమ నేఫద్యంలో నేనింతే అనే ఫ్లాప్ సినిమా తీసారు. ఎంతో అనుభవం,ఎన్నో హిట్లు ఉన్న ఆయన ఇలా తీయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా హిందీలో లక్ బై ఛాన్స్ పేరుతో ఓ సినిమా రిలీజైంది. ఫర్హాన్ అఖ్తర్ (దిల్ చాహతా హై,డాన్ డైరక్టర్)హీరోగా, కొంకణా సేన్ శర్మ కాంబినేషన్లో నూతన దర్శకురాలు జోయా అఖ్తర్ రూపొందించిన ఈ సినిమా అందరి ప్రశంసలూ పొందుతోంది. నేనింతే కి దీనికి పోలిక ఏమిటీ అంటే...లక్ బై ఛాన్స్ సినిమా కూడా సినీ పరిశ్రమ నేఫద్యంలో రూపొందించిందే.

    ఇక ఈ చిత్రంలో కథ..కాన్పూర్ నుంచి పెద్ద సినీ స్టార్ అవ్వాలనే కలను వెతుక్కుంటూ ముంబయి వచ్చిన సోనా మిశ్రా(కొంకణా సేన్ శర్మ), కంఫర్ట్ గా ఉండే తన తండ్రి బిజెనెస్ ని సైతం కాదనుకుని హీరోగా ఎదగాలని..ముంబయి చేరిన డిల్లీ కుర్రాడు విక్రమ్ జైసింగ్ (పర్హాఖాన్) చుట్టూ తిరుగుతుంది. నిరాశతో కూడిన సినీ ప్రస్ధానంలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే ప్రాసెస్ లో ప్రేమలో పడి.. అనంతరం దాన్ని రొమాంటిక్ రిలేషన్ షిప్ గా మార్చుకుంటారు. అలాగే అక్కడ పెద్ద స్టార్స్,కాంబినేషన్ తో వర్క్ చేస్తేనే వర్కవుట్ అవుతుందనే పెద్ద నమ్మకం గల రోమీ రాయ్(రిషి కపూర్) అనే భారీ నిర్మాత ఉంటాడు. ఆయన తన తర్వాత సినిమాకు డెబ్బైలో ఓ వెలుగువెల్గిన నేనా వాలియా(డింపుల్ కపాడియా)కూతురు నిక్కి(ఇషా శర్వాణీ)ని సినీ వారసురాలుగా పరిచయం చేసి క్రేజ్ క్రియోట్ చేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తూంటాడు.

    అయితే అతని చేతిలో ఉన్న సూపర్ స్టార్ జఫ్ఫార్ ఖాన్(హృతిక్ రోషన్)కి పెద్ద దర్శకుడు కరణ్ జోహార్ దగ్గర నుండి ఆఫర్ వస్తుంది. దాంతో జఫర్ ఆ ప్రాజెక్టు నుండి నైస్ గా తప్పుకుంటాడు. ఆ తర్వాత రోమీ పెద్ద హీరోలను(అభిషేక్,జాన్ అబ్రహం,అక్షయ్ ఖన్నా,వివేక్ ఒబరాయ్)ట్రై చేస్తాడు. అందరూ సున్నతంగా తిరస్కరిస్తారు. ఆ పరిస్ధితిలో రోలీ తప్పని స్ధితిలో ఓ కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ అన్వేషణ విక్రమ్ అదృష్టం బాగుండి అతని వద్ద ఆగుతుంది.

    దాంతో కథ ఓ టర్న్ తీసుకుంటుంది. విక్రమ్ కి వచ్చిన ఆ ఊహించని అవకాశం అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. పాత పరిచయాలను పట్టించుకోవటం మానేస్తాడు. తన గర్ల్ ప్రెండ్ సోనాను సైతం కాదనుకుంటాడు. అంతేగాక షూటింగ్ సమయంలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న నిక్కీతో అనుబంధం పెంచుకుంటాడు. ఇలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో సోనా ఏం నిర్ణయం తీసుకుంది సినిమాకి హైలెట్ గా నిలిచింది.

    అలా సినీ పరిశ్రమపై తనకున్న అభిప్రాయాలే కాక,సహజత్వానికి పెద్ద పీట వేసి,హీరోయిజం,ఫైట్స్ వంటివి పెట్టకుండా తీర్చిదిద్దిన విధానం హిందీ పరిశ్రమలోనే కాకుండా తెలుగు పరిశ్రమలోనూ చాలామంది చేత శభాష్ అనిపించేలా చేస్తోంది. దాంతో ఎంతవద్దనుకున్నా వారి టాపిక్స్ లో పూరీ నేనింతే ప్రశక్తి వస్తోంది. వారు ఈ సినిమాను పూరీ చూస్తే(ఇప్పటికే చూసుంటే ఇబ్బంది లేదు)బాగుంటుందని సూచిస్తున్నారు. మరికొంతమందయితే...పూరీకి ఈ సినిమా టిక్కెట్ పంపాలి..గాంధీగిరిలా అనే కామెంట్స్ సైతం చేసుకుంటున్నారు. అది బాలీవుడ్ అక్కడ ఎన్నైనా ప్రయోగాలు చేయవచ్చు..ఇక్కడ కుదరవు అనే కామన్ కామెంట్ చేయకుండా చూడదగ్గ ఈ చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X