»   » పూరీ జగన్ టైటిల్స్ కి పేరడీగా బ్రహ్మాజి

పూరీ జగన్ టైటిల్స్ కి పేరడీగా బ్రహ్మాజి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు బ్రహ్మాజీ రీసెంట్ గా ట్విట్టర్ లో దర్శకుడు పూరీ జగన్ టైటిల్స్ ని పేరీడీ చేస్తూ కొన్ని టైటిల్స్ రాసారు. అవి...అమ్మ నాన్న ఓ ట్విట్టరు,ట్విట్టర్ వాలా, ట్విట్టర్ గాడు మేడిన్ బ్యాంకాక్, నేనా నా ట్విట్టర్, ట్విట్టర్-2. ఇక ఈ టైటిల్స్ ని ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. రామ్ గోపాల్ వర్మ దొంగలముఠాలో చేసిన బ్రహ్మాజి ప్రస్తుతం కొన్ని చిత్రాలలో కీలక పాత్రలు చేస్తున్నారు. కృష్ణవంశీకి సన్నిహితుడైన బ్రహ్మాజి..సింధూరం వంటి చిత్రాల్లో హీరోగా చేసినా క్లిక్ అవ్వకపోవటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ది బిజెనెస్ మ్యాన్ స్క్రిప్టులో బిజీగా ఉన్నారు. మహేష్ తో రూపొందే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కాజల్ హీరోయిన్ గా చేసే ఆ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో అదే టైటిల్ తో అభిషేక్ బచ్చన్ తో పూరీ రూపొందించటానకి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగులో విడుదల అయ్యాక ఆ చిత్రం షూటింగ్ ఉంటుంది. ఇక పూరీ జగన్ విభిన్నమైన టైటిల్స్ పెట్టడంలో సిద్దహస్తుడు. డైలాగులు, టైటిల్స్ ఆయన బలం అని మొన్న హిందీ సినిమాలోనూ ప్రూవ్ అయ్యింది.

English summary
Puri's new titles..amma nanna O twitteru, ,twitterwala,twittergadu made in bangkok,nenu na twitteru ,twitter htb nd twitterman,twitter_2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu