»   » పూరీ 'హార్ట్‌ఎటాక్‌' ఫస్ట్ లుక్ విడుదల(అఫీషియల్ ఫోటో)

పూరీ 'హార్ట్‌ఎటాక్‌' ఫస్ట్ లుక్ విడుదల(అఫీషియల్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా ఈ ఉదయం విడుదల చేసారు. చాలా ఇంట్రస్టింగ్ గా ..."I need a one hour kiss to burn 3000 calories", అనే కాప్షన్ తో ఈ ఫస్ట్ లుక్ రెడీ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ ఫోటో


ఇక ఈ చిత్రం హీరో క్యారక్టరైజేషన్ తో నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుతున్నారు. నితిన్ చిత్రం విడుదల పై ట్వీట్ చేస్తూ...నా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం పూర్తి ప్రేమ కధా చిత్రం. సంక్రాంతికి విడుదల అవుతుంది.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్‌ సరసన ఆదా శర్మ హీరోయిన్ . ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశాలు విశ్రాంతికి ముందొస్తాయట.

అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈచిత్రంలో నితిన్‌కు లుక్ తాజాగా బయటకు వచ్చింది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది.

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Director Puri Jagan has released the first look of his upcoming romantic entertainer, ‘Heart Attack , today morning via Twitter. The poster has a very interesting theme, with a provocative caption. “I need a one hour kiss to burn 3000 calories”, it says. Heart Attack has already completed major part of the movie.Not just that, he is also readying it up for Sankranthi release. Currently he is filming it in Spain with lead actors Nithin and Adha Sharma. He tweets, "My HEART ATTACK movie is a love story, releasing on pongal."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu