»   »  పూరి చిరుత రెమ్యునరేషన్ రూ.4 కోట్లా???

పూరి చిరుత రెమ్యునరేషన్ రూ.4 కోట్లా???

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరుత సినిమా వసూళ్లు సంగతేమో కానీ ఆ సినిమాకు పనిచేసిన దర్శకుడు, హీరోలకు మాత్రం పెద్దమొత్తాలే ముట్టినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. చిరుత హీరో రామ్ చరణ్ రూ.3 కోట్లకు పైగా తీసుకుని వాళ్ల అమ్మ సురేఖకు ఇచ్చినట్టు ఈ మధ్య వచ్చిన వార్తల సారాంశం. ఇపుడు ఈ సినిమా దర్శకుడు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి పుకార్లు వస్తున్నాయి. ఆయన ఈ సినిమాకు రూ.4 కోట్లు తీసుకున్నాడని అనుకుంటున్నారు. ఆయన మూడు, ఈయన నాలుగు కోట్లన్నమాట. ఇద్దరికే రూ.7 కోట్లకు పైగా వదిలితే సినిమా ఖర్చు తడిసిమోపడైనట్టేకదా. అశ్వనీదత్ గారే ఈ వివరాలు చెబితే బాగుంటుందేమో అనుమానాలు తీరతాయేమో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X