»   » మహేష్, ఎన్టీఆర్ లతో కాదట, అల్లరి నరేష్ తోనే

మహేష్, ఎన్టీఆర్ లతో కాదట, అల్లరి నరేష్ తోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో హిట్ కొట్టిన చరిత్ర పూరి జగన్నాధ్. ఆ తర్వాత తెలుగు సినిమా చరిత్రనే తిరగ రాసిన పోకిరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఘనత కూడా పూరిదే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన బాగా వెనకపడ్డారు.

 Puri to team up with Allari Naresh ?

ఆయన సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. వారంలో స్క్రిప్టు రాస్తానని చెప్పే ఆయన కథలు వారం కూడా ఆడటం లేదు. ఈ నేఫధ్యంలో ఆయనతో చేయటానికి పెద్ద హీరోలు ఉత్సాహం చూపించటం లేదు. ఈ నేపధ్యంలో పూరి జగన్నాథ్ కామెడీ హీరో అల్లరి నరేష్ తో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

మహేష్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నా అది చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. అలాగే ఎన్టీఆర్ తో సినిమా కూడా సుదూర తీరంలో డేట్స్ ఇచ్చే వాతావరణం కనపడటం లేదు. అంత గ్యాప్ తీసుకుని జనం మర్చిపోవటం కన్నా తనలోని కామెడీ టింజ్ ని చూపిస్తూ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 Puri to team up with Allari Naresh ?

ఈ ప్రాజెక్టుని రీసెంట్ గా నాన్నకు ప్రేమతో చిత్రం నిర్మించిన బి.విఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ సైతం ఎగిరి గంతేసి డేట్స్ ఇచ్చాడని చెప్తున్నారు. అయితే అల్లరి నరేష్ లో ని కామెడీ యాంగిల్ ని వాడుకుంటాడా లేక హీరోయిజం చూపిస్తాడా చూడాలి.

English summary
Director Puri Jagan may soon direct Allari Naresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X