»   »  నాగ్ చైతన్య పూరీ కాంబినేషన్

నాగ్ చైతన్య పూరీ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Puri Jaganath
సక్సెస్ ఫుల్ దర్శకుడు పూరీ జగన్నాధ్ కి నాగార్జున తన కుమారుడు నాగ్ చైతన్య ని లాంచ్ చేసే కార్యక్రమాన్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.'చిరుత' సినిమాతో రామ్ చరణ్ తేజను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయటం పూరీకి కలిసి వచ్చింది. దాంతో ఆయనే సమర్థుడు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అందులోనూ పూరీతో నాగార్జున ఆల్రెడీ 'శివమణి','సూపర్' సినిమాలు చేసి ఉన్నాడు. యూత్ నాడిని పసిగట్టటంలో పూరీ పండిపోయి ఉన్నాడనేది దాంతో అర్దమైంది.'దేశముదురు, పోకిరి'హిట్ లు పూరీని గ్యారింటీ దర్శకుడిగా మార్చేసాయి.ఆ హీరోలు ఇద్దరూ తమ కెరీర్ రికార్డులు తిరగరాసుకున్నారు . ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న బుజ్జిగాడు మేడిన్ చెన్నై కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇవన్నీ నాగార్జున దృష్టిలో పెట్టుకునే ఆఫర్ ఇవ్వటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X