»   » డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా-2

డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా-2

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో.. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీమతి లత సమర్పణలో ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 30న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి.వెంకటేష్ తెలియజేస్తూ

pizza

ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిద హిట్‌గా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు, తెలుగు థ్రియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో ప్రేమకథా చిత్రమ్, జక్కన్న లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మించిన ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది.

pizza2

తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు. గాయత్రి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.

English summary
A film titled “Puriyaatha Puthir” is now coming up in Telugu which features Vijay Sethupathi and Gayathrie in the leads. Directed by Ranjit Jeyakodi will be Released on this December 30
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu