»   »  పుష్కరాల ముగింపు...డెరైక్షన్ బోయపాటి శ్రీనుదే

పుష్కరాల ముగింపు...డెరైక్షన్ బోయపాటి శ్రీనుదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా పుష్కరాల్లో రాజమండ్రి వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోవడానికి సీఎంతోపాటు, బోయపాటి కూడా కారణమని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ముగింపు ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా తిరిగి బోయపాటి చేతుల్లోనే పెట్టారు.

బోయపాటి శ్రీను శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా రాజమండ్రిలో గోదావరి పుష్కర స్నానం ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రధానం చేసారు. మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు పుష్కరాలు ఎంతో గొప్పగా జరిగాయన్నారు. ముగింపు అద్భుతంగా ఉండాలని, ముగింపు వేడుకలు ప్రజలకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని తెలిపారు. అందుకే తాను రాజమండ్రి వచ్చానని, ముగింపు వేడుకలు కన్నుల పండువగా నిర్వహిస్తామని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే.... గోదావరి పుష్కరాల ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యోగా గురువు బాబా రాందేవ్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వందలాది ప్రముఖులు పాల్గొననున్న ముగింపు ఉత్సవం కోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.

ఈ నేపధ్యంలో గోదావరి నిత్యహారతి, పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకే ఈ బాధ్యతలను అప్పగించింది.

Puskaralu last day programe direction by Boyapati

ఈ మేరకు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గోదావరి తీరం, ఆర్ట్స్ కళాశాలల్లో జరిగే ముగింపు వేడుకలకు సభావేదికల రూపకల్పన కార్యక్రమాల డిజైన్ అంతా దగ్గరుండి చూసుకునేందుకు ఆయన గురువారం రాజమండ్రి చేరుకున్నారు.

దాంతో ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయమై రాష్ట్ర డీజీపీ, ఇతర అధికారులతో బోయపాటి సమాలోచనలు జరిపారు. 25న రాత్రి నిత్యహారతిని నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఇరు వంతెనల నుంచి భారీ ఫోకస్ లైట్లు ఏర్పాటు చేసి ఆ వెలుగులతో నదీజలాలు సప్తవర్ణశోభితంగా కన్పించేలా తీర్చిదిద్దడంతోపాటు హారతి సమయంలోపంట్లు చుట్టూ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే హారతి ఇచ్చే వేళల్లో పురోహితులు వేదమంత్రోచ్ఛరణలకు భక్తులు తన్మయత్వం పొందేలా శ్రావ్యమైన సంగీతం స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

మరొకవైపు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ముగింపు వేడుకల్లో భారీతనం ఉట్టిపడే రీతిలో సినిమా సెట్టింగ్‌లో వేదికను తీర్చిదిద్దడంతోపాటు సినీ కళాకారులు, గాయకులతో సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.చివరగా వెయ్యి మంది కూచిపూడి నృత్య కళాకారులు ఒకేసారి నృత్యప్రదర్శన ఇచ్చేలా వేదికను, సౌండ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దే బాధ్యతను బోయపాటికి అప్పగించారు.

Puskaralu last day programe direction by Boyapati

మరో ప్రక్క...

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై అమలాపురం మాజీ ఎంపి జీవి హర్షకుమార్ కుమారుడు జీవి శ్రీరాజ్ త్రీ టౌన్ పోలీ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పుష్కరాలు ప్రారంభం రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీయటమే తొక్కిసలాటకు కారణం అని, తమ పాపులారిటీని పెంచుకునేందుకు పుష్కరాలను చంద్రబాబు ఉపయోగించుకున్నారని శ్రీరామ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

షార్ట్ ఫిలిం రూపకల్పనకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారని, షార్ట్ ఫిల్మ్ మిషతో ఆయన అనధికార అడ్మినిస్ట్రేటర్ గా వ్యవరించారని తెలిపారు. పుష్కర ప్రారంభోత్సవంతో బోయపాటికి శ్రీనివాస్ కు ఏ సంభంధం లేనప్పటికీ , తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా వ్యవరించారని అన్నారు. ఆయనకు ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ, ప్రొటోకాల్ వ్యవహారంతో ఎటువంటి అనుభవమూ లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. బోయపాటి శ్రీను అనధికార నిర్వహణలో పుష్కరాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలనాటి నటి జమున కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి పుష్కరఘాట్‌కు వచ్చారు. పుష్కరఘాట్‌లో స్నానమాచరించిన జమున రాజమండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ అభివృద్ధిలో చాలా మార్పు వచ్చిందని జమున సంతోషం వ్యక్తం చేశారు.

English summary
CM Chandra Babu Naidu gave another chance to Boyapati Srinu for Rajamundry Pushkaralu last day.
Please Wait while comments are loading...