»   » మెమరీ లాస్ తో ... (పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ ప్రివ్యూ)

మెమరీ లాస్ తో ... (పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pusthakamlo konni pageelu missing
హైదరాబాద్ : 'తమిళంలో హిట్టయిన 'నడువుల కొంజెం పక్కత్తినె కానుం' చిత్రం రీమేక్ వెర్షన్ గా రూపొంది ఈ రోజు వస్తున్న చిత్రం పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌. నలుగురు స్నేహితుల కథ ఇది. పెళ్లి ఖరారైన తమ స్నేహితుడు 'షార్ట్ టైమ్ మెమరీ లాస్'కి గురైతే, ఆ విషయాన్ని దాచేసి అతనికి ఏ విధంగా స్నేహితులు పెళ్లి చేస్తారు? అనేది కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ కూడా హిట్టవుతుందనే నమ్మకంతో దర్శక,నిర్మాతలు ఉన్నారు.

కథలో ....విజయ్‌ కుమార్‌ (శ్రీ), సంధ్య (సుప్రజ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. ఆ ఆనందంలో పెళ్లికి ముందురోజు శ్రీ తన స్నేహితులు శివ(రాహుల్‌), బాలాజి (సతీష్‌), సలీమ్‌ (మస్త్‌ అలి)తో కలసి క్రికెట్‌ ఆడటానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా విజయ్‌ గాయపడతాడు. ఈ ప్రమాదం వల్ల విజయ్‌ తన గతంలో సంధ్యని ప్రేమించిన రోజులు, పెళ్లి గురించి మరచిపోతాడు. అప్పుడు విజయ్‌ పెళ్లి చేయడానికి అతని స్నేహితులు ఏం చేశారు.. పెళ్లి జరిగిందా లేదా అనేది ఆసక్తికర అంశం.

శ్రీ మాట్లాడుతూ -''తమిళంలో హిట్టయిన 'నడువుల కొంజెం పక్కత్తినె కానుం' చిత్రం సీడీ ఇచ్చి నన్ను చూడమన్నారు దర్శకుడు ఖురేషి. నాకు తమిళం రాదు. అందుకే నా కుటుంబ సభ్యుల్ని చూడమన్నాను. వారందరీకీ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకి ఓకే చెప్పా. ఈ పాత్ర పోషిస్తున్నప్పుడే అందులోంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది.

ఇందులో నేను మెమరీలాస్ పేషెంట్‌ని. సెలైంట్‌గా ఉంటూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తా. నటునిగా నా సామర్థ్యాన్ని పెంచే పాత్ర ఇది. ఈ తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చారు దర్శకుడు ఖురేషీ. రీమేక్ ఇలాక్కూడా చేయొచ్చా అనిపించేలా ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరినీ నచ్చుతుందని నా నమ్మకం'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''గతం మరచిపోయిన ఓ యువకుడి పెళ్లి జరిపేందుకు అతని స్నేహితులు ఏం చేశారు అనేదే చిత్రం. ఈ క్రమంలో వారి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయి. చాలా మంది జీవితంలో మరచిపోవడం సహజం. కానీ కాబోయే భార్యను మరచిపోతే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. 45 నిమిషాల పెళ్లి సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ''గా నిలుస్తాయన్నారు.

పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌
సంస్థ: బ్లాక్‌ బస్టర్‌ స్టుడియో
నటీనటులు: శ్రీ, సుప్రజ, రాహుల్‌, సతీష్‌, మస్త్‌ అలి, రఘుబాబు, తదితరులు.
సంగీతం: గుణ్వంత్‌ సేన్‌
నిర్మాత: మహ్మద్‌ సోహైల్‌ అన్సారీ,
దర్శకత్వం: సాజిద్‌ ఖురేషి
విడుదల: శుక్రవారం.

English summary
Ee rojullo fame sri's new film pusthakamlo konni pageelu missing relesing today. Pusthakamlo Konni Pageelu Missing - Telugu Movie is an Indian comedy film directed by Sajid Qureshi and produced by Sohail Ansari under her production banner Blockbuster Studio.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu