For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదీ మ్యాటర్: మహేష్ నెక్ట్స్ మాతోనే అని ప్రకటన

  By Srikanya
  |

  హైదరాబాద్ : మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో "బ్రహ్మోత్సవం" అనే చిత్రాన్ని పివిపి వారు నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో కానీ, పూరి తో కానీ చెయ్యబోతున్నారని వార్తలు మీడియాలో మొదలయ్యాయి. శ్రీమంతుడు చిత్రం ఫ్యామిలీ చిత్రం కాబట్టి నెక్ట్స్ మళ్లీ కుటుంబ కథా చిత్రం చేయడని కాబట్టి "బ్రహ్మోత్సవం" కు కొంత సమయం పడుతుందని లాజిక్ లు మొదలయ్యాయి. అయితే నిర్మాత పివీపి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  పిపిపి సినిమా సంస్ధ అథిపతి పొట్లూరి వర ప్రసాద్ తన తదుపరి చిత్రం "బ్రహ్మోత్సవం" అని ప్రకటించి ఖరారు చేసి ఈ రూమర్స్ కు తెరదించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోందని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చినట్లైంది.

  అలాగే... కొద్ది రోజుల క్రితం పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

  PVP Cinema confirms Mahesh “Brahmotsavam”

  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  ‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

  మహేష్ 'శ్రీమంతుడు'తాజా విశేషాలకు వస్తే...

  మహేష్‌బా బుహీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో కొన్ని సన్నివేశాలు, పోరాట ఘట్టాలూ చిత్రీకరించారు.

  షూటింగ్‌ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్‌ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్‌పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

  కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  PVP Cinema, Prasad Potluri has confirmed that their next will be “Brahmotsavam”. Featuring Mahesh, the film will go floors soon. Srikanth Addala who has earlier made Seethamma Vaakitlo with Mahesh is now directing this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X