»   »  మహేష్ సినిమా వివాదం: వంశీ పైడిపల్లిపై పివీపి ఫిర్యాదు, హైకోర్టు కు కూడా

మహేష్ సినిమా వివాదం: వంశీ పైడిపల్లిపై పివీపి ఫిర్యాదు, హైకోర్టు కు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో భారీ సినిమాలను నిర్మించే బ్యానర్‌లలో 'పివిపి సినిమాస్' ఒకటి. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో చాలావరకు ఫ్లాఫ్ లు ఉన్నా...ఎక్కడా వెనకాడకుండా..వరస సినిమాలు తీస్తూ వస్తున్నారు. అయితే నాగ్, కార్తీలతో చేసిన ఊపిరి చిత్రం 'పివిపి సినిమాస్' సక్సెస్ రేట్‌కి కాస్త 'ఊపిరి' పోసిందని చెప్పుకోవచ్చు.

ఆ బ్యానర్‌లో అత్యధిక వసూళ్లు (రూ.100 కోట్లపైనే గ్రాస్) రాబట్టిన చిత్రం కూడా అదే. అలాంటి విజయాన్ని అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లిపైనే పివిపి తాజాగా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. తనకు ఇచ్చిన కమిట్మెంట్‌ను తుంగలో తొక్కినందుకే పివిపి అలా చేశారని తెలుస్తోంది.

ఈ విషయమై పీవీపి సంస్ద హైకోర్టుకు కూడా వెళ్లిందని సమాచారం. పీవిపి సంస్దకు, వంశీ పైడిపల్లి కు మధ్య విభేధం రావటానికి కారణం ఏమిటి..అసలేం జరిగింది అనే విషయమై ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.

 ఎగ్రిమెంట్ కాదని...

ఎగ్రిమెంట్ కాదని...

దర్శకుడు వంశీ పైడిపల్లిపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి. ‘వూపిరి' తర్వాత తన సంస్థ పీవీపీ సినిమాలో మరో సినిమా చేసేందుకు వంశీతో ఒప్పందం కుదుర్చుకొన్నాననీ, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆయన వేరొక నిర్మాతతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రసాద్‌ వి.పొట్లూరి.

 అశ్వనీదత్ తో చేయనున్నట్లు

అశ్వనీదత్ తో చేయనున్నట్లు

...
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇదివరకు ‘వూపిరి' చిత్రాన్ని నిర్మించారు ప్రసాద్‌ వి.పొట్లూరి. ఆ చిత్రం తర్వాత ఇద్దరూ కలిసి మహేష్‌బాబుతో ఓ సినిమా చేసేలా ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల తాను దిల్‌రాజు, ఆశ్వనీదత్‌ నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు వంశీ పైడిపల్లి. ఆ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

 తన సంస్దలో తీయకపోతే...

తన సంస్దలో తీయకపోతే...

వంశీ పైడిపల్లి తదుపరి సినిమా తన సంస్థలో తీయకపోతే ‘వూపిరి' చిత్రానికి వచ్చిన నష్టం మొత్తాన్ని చెల్లించాలని కోరారు. రెండు రోజుల కిందట ఈ ఫిర్యాదు అందిందని, త్వరలోనే దర్శకుల సంఘం పరిశీలన కోసం పంపుతున్నట్టు నిర్మాతల మండలి వర్గాలు తెలిపాయి.

హైకోర్టుకి

హైకోర్టుకి

ఈ సినిమా విషయంలోనే ప్రసాద్‌ వి.పొట్లూరి తమిళనాడు హైకోర్టుని కూడా సంప్రదించారు. పివిపి సంస్థ అభ్యర్థన మేరకు చెన్నయ్ హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేసింది. పివిపి సంస్థ మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమా కోసం తయారుచేసిన కథను, ఆ దర్శకుడు వంశీ పైడిపల్లి, రచయితలు హరికృష్ణ, ఎ సోలమన్ లు మరే విధంగానూ వాడకూడదని ఆ ఇంజక్షన్ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కోన్నట్లు తెలుస్తోంది.

 బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ తో...

బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ తో...

మ‌హేష్ బాబు ఈ బ్యాన‌ర్ లో చేసిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్లాప్ అవ్వ‌డంతో పివిపికి మ‌రో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా వంశీ పైడిప‌ల్లి పివిపి ఆఫీస్ లో ఉంటూ మ‌హేష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసారు. మ‌రి...ఏమైందో ఏమో కానీ...వంశీ పైడిప‌ల్లి నిర్మాత‌ను మార్చేసి మ‌హేష్ 25వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను.

 లాంచ్ చేసిందే...

లాంచ్ చేసిందే...


దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మున్నా, బృందావనం చిత్రాలు వచ్చి విజయవంతం అయ్యాయి. వంశీ పైడిపల్లి లాంచ్ అయ్యిందే దిల్ రాజు చిత్రంతో. ఈ నేపధ్యంలో దిల్ రాజుతో వంశీ పైడిపల్లి సినిమా చేయాలనుకోవటం వింతేమీ కాదు.

 మహేష్ డెశిషన్ ఏంటో...

మహేష్ డెశిషన్ ఏంటో...

మహేష్ హీరోగా రూపొందటానికి అనుకున్న ఈ చిత్రం విషయం వివాదంలో ఇరుక్కోవటంతో ... ఆయన ఏమంటారో , ఏం డెషిషన్ తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. మహేష్ కు దిల్ రాజు కు మంచి రిలేషన్ ఉంది. దిల్ రాజు నిర్మాతగా ..మహేష్ హీరోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది.

ఆ కృతజ్ఞతతో...

ఆ కృతజ్ఞతతో...

అశ్వనీదత్ బ్యానర్ పై వచ్చిన రాజకుమారుడు చిత్రం మహేష్ లాంచ్ అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించి మహేష్ ని ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి దోహదం చేసింది. ఈ నేపధ్యంలో ఆ కృతజ్ఞతతో మహేష్ ఓ చిత్రాన్ని చేస్తానంటూ అశ్వనీదత్ కు డేట్స్ ఇవ్వటానికి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.

ఆయనకు తెలియకుండా జరుగుతాయా

ఆయనకు తెలియకుండా జరుగుతాయా

ఇక ఇంత వ్యవహారం జరుగుతున్నా...వంశీ పైడిపల్లి తను బ్యానర్ మార్చి సినిమా చేయబోతున్నా అని చెప్పిన విషయాలు మహేష్ బాబు కు తెలియకుండా జరుగుతాయా అంటున్నారు. అయితే ఇదంతా మహేష్ ని సంప్రదించి వంశీ పైడిపల్లి చేసారా లేక స్వంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది.

 ఈ ట్వీట్ తోనే అంతా

ఈ ట్వీట్ తోనే అంతా

ఇక ఇంత వివాదం, రాధ్దాంతం జరగటానికి మూలమైన వంశీ పైడిపల్లి ట్వీట్ ఇధే. ఈ ట్వీట్ లో తాను మహేష్ బాబు తో సినిమా చేస్తున్నానని, అశ్వనీద్, దిల్ రాజు నిర్మాతలను అని తెలియచేసారు. అంటే కొద్ది రోజుల క్రితమే ఈ వివాదం ప్రారంభమై...ఇప్పుడిలా హైకోర్టు, ఫిర్యాదులతో వేడిక్కిందన్నమాట.

English summary
Producer PVP lodged complaint in Producers' Council against director Vamshi Paidipally for not honouring the agreement despite taking advance amount from the production house for Mahesh Babu's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu