twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రుతిహాసన్‌ పై కేసు వెనక్కి...తెర వెనుక రాజీ

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ నటి శ్రుతిహాసన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ సిటీ సివిల్‌ కోర్టులో పిక్చర్‌ హౌజ్‌ మీడియా సంస్థ అర్జీ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా పివిపి వారు కేసుని ఉపసంహరించుకున్నారు. కోర్టు బయిట తమిళ నిర్మాతల సంఘం ఈ కేసుని రాజికి వచ్చే ప్రయత్నం చేసి విజయం సాధించింది. శృతి హాసన్ వరసగా తమిళ సినిమాలు చేస్తున్న నేపధ్యంలో తమకు దెబ్బ అనుకున్న పెద్ద తమిళ నిర్మాతలు కలుగచేసుకోవటం శృతికు కలిసి వచ్చింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రెండు రోజుల క్రితం... న్యాయస్థానానికి శ్రుతిహాసన్‌ తరపున న్యాయవాది వివరణ ఇస్తూ.. శ్రుతికి పిక్చర్‌ హౌజ్‌ మీడియా సంస్థ ఎలాంటి ముందస్తు చెల్లింపులు ఇవ్వలేదని, శ్రుతిని వేధించేందుకే కేసు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. శ్రుతిహాసన్‌ స్థానంలో తమన్నాను ఎంపిక చేసి సినిమా చిత్రీకరణ చేశారని, శ్రుతి కొత్త సినిమాలు ఒప్పుకోవద్దన్న ఉత్తర్వులను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదాపడింది.

    PVP withdraw Shruti Haasan case

    తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్న శృతిహాసన్ కెరీర్ కు అర్దాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఆమె ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసింది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఈమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడిగ్స్ జరపమని కోరారు.

    తమ సంస్థ నిర్మించే సినిమా విషయంలో ముందస్తు ఒప్పందాన్ని కథానాయిక శృతిహాసన్ ఉల్లంఘించిందని చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్ ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొత్త సినిమాలకు శృతిహాసన్ సంతకం చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్‌నిచ్చింది.

    ఈ కేసును విచారించి చర్యలు చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసుకు దారితీసిన పరిస్థితుల్ని తెలియజేస్తూ పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..నాగార్జున, తమిళ నటుడు కార్తి కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటించడానికి శృతిహాసన్ అంగీకరించింది. అందుకుగాను పిక్చర్‌హౌస్ మీడియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

    PVP withdraw Shruti Haasan case

    తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్‌లో శృతిహాసన్ ఇప్పటివరకు పాల్గొనలేదు. ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణంగా డేట్స్‌ను సర్దుబాటు చేసుకోలేకపోతున్నానని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నానని శృతిహాసన్ ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమా విషయంలో ఆమెతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాతే, ఆమెకు అనుకూలమైన డేట్స్‌ను తీసుకోవడం జరిగింది.

    అర్థాంతరంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో మా సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లింది. శృతిహాసన్ వృత్తి వ్యతిరేక బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల మా సంస్థ పేరుప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం కూడా వుంది. దాంతో పాటు ఇతర ఆర్టిస్టుల సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటి వృత్తిధర్మ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకూడదని శృతిహాసన్‌పై కేసు వేశాం అని పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ పేర్కొంది.

    English summary
    Finally, relief has come in for Shruti Haasan when the Tamil Film Producer’s Council and South India film Artists Association intervened to solve the issue. Obliging their requests, the Picture House Media Pvt Ltd. has withdrawn its case on the actress, only to respect the associations’ heads and to maintain cordial relationship with the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X