»   » ఆది ‘ప్యార్ మే పడిపోయానే’ మరింత ఆలస్యం

ఆది ‘ప్యార్ మే పడిపోయానే’ మరింత ఆలస్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు చిత్రాల తర్వాత యంగ్ హీరో ఆది నటిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు కానీ....షూటింగ్ పూర్తి కాని కారణంగా విడుదల మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటి స్తామని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...కులుమనాలి, మునార్ లలో ఆది, శాన్విలపై తీసిన రెండు పాటలతో టోటల్ షూటింగ్ పార్టు పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. డైరెక్టర్ రవి చావలి ఈ సబ్జెక్టును చాలా ఎక్సలెంటుగా డీల్ చేస్తున్నారు. ఏమైంది ఈ వేళ, అధినేత చిత్రాల తర్వాత మా బేనర్లో ఈ చిత్రం హాట్రిక్ చిత్రం అవుతుంది అన్నారు.

Pyar Mein Padipoyane release delay

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ...ఆది పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం ఆది కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుంది. మా బేనర్లో వస్తున్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఈ చిత్రం. అనూపర్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది' అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ వివ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహా, పృథ్వీ, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా జనక్, మాధవి సిద్ధం, విష్ణు ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ : టి.మణిశ్రీ, కెమెరా: టి.సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.రవికుమార్, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వం: రవి చావలి.

English summary
Aadi, Shanvi starrer Pyar Mein Padipoyane in post production stage. The movie to release soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu