»   » ‘ప్యార్ మే పడిపోయానే’ అంటూ 28న హీరో ఆది!

‘ప్యార్ మే పడిపోయానే’ అంటూ 28న హీరో ఆది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు చిత్రాల తర్వాత యంగ్ హీరో ఆది నటిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో హీరో ఆది ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నాం. మార్చి 11 నుండి 18 వరకు విదేశాల్లో చిత్రీకరించే రెండు పాటలతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మార్చి రెండో వారంలో ఆడియోను రిలీజ్ చేసి మార్చిన 28న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ రవి చావలి ఈ సబ్జెక్టును చాలా ఎక్సలెంటుగా డీల్ చేస్తున్నారు. ఏమైంది ఈ వేళ, అధినేత చిత్రాల తర్వాత మా బేనర్లో ఈ చిత్రం హాట్రిక్ చిత్రం అవుతుంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ...ఆది పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం ఆది కెరీర్లో మరో సూపర్ హిట్ అవుతుంది. మా బేనర్లో వస్తున్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఈ చిత్రం. అనూపర్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది' అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ వివ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహా, పృథ్వీ, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా జనక్, మాధవి సిద్ధం, విష్ణు ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ : టి.మణిశ్రీ, కెమెరా: టి.సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.రవికుమార్, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వం: రవి చావలి.

English summary
Aadi, Shanvi starrer Pyar Mein Padipoyane is in the last leg of shooting. Currently, a song is being shot on Aadi in Nanakramguda, Hyderabad and after this couple of songs will be canned in foreign locations. Pyar Mein Padipoyane to release on March 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu