»   » ‘బాహుబలి 2’ ప్రీమియర్ షో కి హాజరయ్యేది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

‘బాహుబలి 2’ ప్రీమియర్ షో కి హాజరయ్యేది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి - ది బిగినింగ్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిజినెస్ నుంచి ప్రమోషన్ వరకూ అన్ని విషయాల్లో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న 'బాహుబలి 2' చిత్రం ప్రీమియర్‌ షో విషయంలోను హాట్ టాపిక్ గా నిలవనుంది. ఎందుకంటే ...ఈ చిత్రం ప్రీమియర్ ను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 చూడనున్నట్లు సమచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 'ఇండియా ఆన్‌ ఫిల్మ్‌' కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది.


Queen Elizabeth II will watch Baahubali 2 before you can

మరో ప్రక్క బాహుబలి2 (ద కంక్లూజన్)కు రిలీజ్ కు ముందే రికార్డులు బ్రద్దలు కొడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నైజాం రైట్స్ ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 40 కోట్లకు దక్కించుకున్నారు.


అంతేకాకుండా 'బాహుబలి2' చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ 51కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. బాహుబలి పార్ట్ 1(ద బిగినింగ్) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో బాహుబలి కోసం మార్కెట్ వర్గాలు క్యూకడుతున్నాయి. ప్రీ రిలిజ్ బిజినెస్ దుమ్మురేపుతోంది.


Queen Elizabeth II will watch Baahubali 2 before you can

 
ఇప్పటికే, బాహుబలి2 ఓవర్సీస్ రైట్స్ తెలుగు, తమిళం, హిందీ కలిసి థియేటర్ రైట్స్ 47కోట్లకు అమ్మినట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మొత్తానికి ఏ హక్కులైన మినిమం 50కోట్లకు ఏమాత్రం తగ్గకుండా మార్కెట్ కావడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఈ సినిమా ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మూడు వెర్షన్స్ (తెలుగు, తమిల, మళయాళం) కు గానూ 45 కోట్లు కు అమ్ముడయ్యాయి. ఓవర్ సీస్ రైట్స్ ఈ స్దాయిలో అమ్ముడవటం ఓ ఇండియన్ సినిమాకు రికార్డే. యుఎస్ లోని టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ వారు ఈ మొత్తాన్ని వెచ్చించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Queen Elizabeth II will be the first person to watch the premiere show of SS Rajamouli's Baahubali: The Conclusion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu