»   » ఏనుగు దంతాల కేసులో ఇరుక్కున్న మోహన్ లాల్

ఏనుగు దంతాల కేసులో ఇరుక్కున్న మోహన్ లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోచి: రీసెంట్ గా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్‌', యేలేటి 'మనం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను గత కొంతకాలంగా ఏనుగుదంతాల కేసు వెంటాడుతోంది. అయితే తాజాగా ఈ కేసుని ఇమ్మీడియట్ గా తేల్చమని, క్విక్ వెరిఫికేషన్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి.

కోచి కోర్టు శనివారం మోహన్ లాల్ ఏనుగు దంతాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. మోహన్‌ లాల్‌ అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారంటూ హక్కుల కార్యకర్త ఏఏ పౌలాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మువత్తుపుళా విజిలెన్స్‌ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నవంబర్‌ 28లోగా దర్యాప్తు నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.

2011లో మోహన్‌లాల్‌ ఇంట్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు జరిపినప్పుడు తొలిసారిగా ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది.2012లో ఆయనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది.

Quick verification against Mohanlal in elephant tusk case

అయితే, తాను ఏనుగు దంతాలు కొనుగోలు చేసినట్టు మోహన్‌లాల్‌ చెప్తున్నారు. వన్యప్రాణి, అటవీ చట్టం ప్రకారం ఎవరైనా ఏనుగు దంతాలు కలిగి ఉండటం అక్రమం. ఈ వ్యవహారంలో అటవీ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, కావాలనే ఉద్దేశపూర్వకంగా మోహన్‌లాల్‌ను కేసు నుంచి తప్పించేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై ఛీఫ్ మినిస్టర్ వెంటనే చర్యలు తీసుకుని విషయం తేల్చాలని ఫారిస్ట్ మినిస్టర్ కు ఆర్డర్స్ పాస్ చేసారు.

మోహన్ లాల్ కెరీర్ విషయానికి వస్తే..ఆయన రీసెంట్ గా మళయాళంలో పెద్ద హిట్ కొట్టారు. మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది.

చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం బెంగాళి రైట్స్ ని ఓ కార్పోరేట్ సంస్ద చేజిక్కించుకోగా, కన్నడ రైట్స్ ని కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కన్నడంలో ఓ తెలుగు దర్శకుడు ఈ రీమేక్ చేస్తాడని వినపడుతోంది.

English summary
The Vigilance court in Muvattupuzha Saturday ordered a quick verification in a case relating to seizure of elephant tusks from actor Mohanlal’s residence in Kochi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu