»   » ఇది కరెక్ట్ కాదు, 1960 నుంచీ దేశం లో డ్రగ్స్ ఉన్నాయ్: స్పందించిన పీపుల్స్ స్టార్

ఇది కరెక్ట్ కాదు, 1960 నుంచీ దేశం లో డ్రగ్స్ ఉన్నాయ్: స్పందించిన పీపుల్స్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా ఆర్. నారాయణ మూర్తి ఎప్పుడో తప్ప పెద్దగా వార్తల్లోకి ఎక్కరు. ఆయన సినిమా విషయం లో తప్ప పక్కవారి సినిమా విషయం లో ఎలాంటి వ్యాఖ్యలూ చెయ్యరు. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నంత సమస్య వస్తే తప్ప ఈ పీపుల్స్ స్టార్ మాట్లాడరు. తనపని తాను చేసుకుంటూ, వివాదాల్లో ఏదైతే తాను నిజం అని నమ్ముతాడో ఆ విషయంలో మాత్రమే ఆయన మాట్లాడతారు. ఇన్నాళ్ళకి ఇంకోసారి ఆయన ఇండస్ట్రీ పక్షాన మాట్లాడారు. ఏదో జరిగిపోతోందీ, టాలీవుడ్ బ్రష్టు పట్టిందీ అన్న స్థాయిలో జరుగుతున్న ప్రచారం విషయం లో చిరాకు వ్యక్తం చేసారు...

డ్రగ్స్ వ్యవహారంపై ఇపుడు ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా స్పందించారు. డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు, మీడియా తమకే సినిమా చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

R Narayana Murthy Comments on Drugs case

సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్‌ వాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్న ప్రచారం మీద అసహనం వ్యక్తం చేసిన నారాయణ మూర్తి. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారని చెప్పి కేవలం సినిమా వాళ్ళనే టార్గెట్ చేయటం ఎందుకని ప్రశ్నించారు.

1960 నుంచి దేశంలో డ్రగ్స్ వాడకం ఉందని చెప్తూ ఇప్పుడు కేవలం సినిమా వాళ్లు మాత్రమే వీటిని వాడుతున్న భ్రమలను కలిగిస్తుండటం సరికాదని., పాఠశాల చిన్నారులు సైతం డ్రగ్స్ కేసుల్లో బానిసలుగా మారుతున్నారన్న వార్తలు బాధను కలిగించాయని, ఈ మాఫియాను సమూలంగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని నారాయణమూర్తి చెప్పారు.

Hyderabad drugs Case : Puri Jagannadh appears before SIT
English summary
Tollywood Peoples Star R Narayana Murthy respond on drugs mafia in tollywood .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu