»   »  ఎవడబ్బ సొమ్ము ఇది? దాసరి సభలో ఆర్ నారాయణమూర్తి ఫైర్!

ఎవడబ్బ సొమ్ము ఇది? దాసరి సభలో ఆర్ నారాయణమూర్తి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ తరుపున జరిగిన దాసరి నారాయణ రావు సంతాప సభలో ఆర్ నారాయణ మూర్తి ఉద్వేగంగా ప్రసంగించారు. దాసరి గొప్పతనం గురించి ఎంతో వివరంగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో దాసరి అందరికీ ఎలా సాయపడ్డారో చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా పద్మ అవార్డుల విషయంలో దక్షిణాది సినీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు నారాయణ మూర్తి. దాసరి నారాయణ రావుకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా కృషి చేద్దామని, అవసరం అయితే ఢిల్లీ వెళ్లి ఫైట్ చేద్దామని వ్యాఖ్యానించారు. ఇండియా అంటే కేవలం నార్త్ ఇండియా కాదని, ఈ దేశం ఎవడబ్బ సొమ్ము కాదని ఫైర్ అయ్యారు.

పిచ్చితో మద్రాసు వెళ్లాను

పిచ్చితో మద్రాసు వెళ్లాను

హీరో కావాలని, పేపర్లో నా బొమ్మ వేయించుకోవాలని, అందరితో క్లాప్స్ కొట్టించుకోవాలనే పిచ్చితో ఊరువాడ, అమ్మ బాబుని అందరినీ వదులుకుని మద్రాసు వెళ్లాను. ఆ రోజుల్లో మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసులో అడుగు పెట్టాను. ఆ డబ్బులు అయిపోయాయి. పాండీ బజారులో, పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ బలంగా వెళ్లిన వాన్ని సన్నగా అయిపోయాను.. అని తెలిపారు.

అలా ఊహించుకున్నాను

అలా ఊహించుకున్నాను

చెన్నై వెళ్లే ముందు ఏదో ఊహించుకున్నాను. నేనెళ్లిన వెంటనే ఎన్టీరామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు రా బ్రదర్... నేను నీకు వేషం ఇస్తాను, భోజనం పెడతాను అని ఊహించుకున్నాను. అక్కడికి వెళ్లాక తెలిసింది. నా లాంటి లక్షలాది మంది సినిమా పిచ్చోళ్లు అక్కడ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా ఏదైనా వేషం వేసిన తర్వాతే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని నారాయణ మూర్తి తెలిపారు.

నా భుజం తట్టిన మహానుభావుడు

నా భుజం తట్టిన మహానుభావుడు

రాజబాబుగారి మేకప్ మేన్ చిన్నిగారు మహాలింగ పురంలో ఓ కారు షెడ్డులో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియోకు తీసుకుని వెళ్లారు. అక్కడ గురువుగారి డైరెక్షన్లో తాత మనవడు షూటింగ్ జరుగుతుంది. అపుడు నేను బొమ్మలు వేసేవాన్ని. నాగేశ్వరరావుగారి బొమ్మేసి గురువుగారు రాగానే చూపించాను. అపుడు ఆయన... తమ్ముడు అని నా భుజం తట్టాడు. ప్రపథమంగా మద్రాసులో భుజం మీద ఆప్యాయంగా గురువుగారు చేయి వేయగానే ఆయలోని మాననీయ కోణానికి శివరస్సు వంచి దండం పెట్టాను. దటీస్ దాసరి నారాయణరావుగారు. కళ్లలో నుండి నీళ్లొచ్చేశాయి... అని నారాయణ మూర్తి తెలిపారు.

మాట ప్రకారం వేషం ఇచ్చారు

మాట ప్రకారం వేషం ఇచ్చారు

దాసరిగారు అపుడు నన్ను ఏం చేస్తున్నావని అడిగారు. ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, నేను హీరో అవ్వాలి సార్, నాకు సినిమా అంటే పిచ్చి అన్నాను. అపుడు ఆయన బిఏ పూర్తి చేసుకుని రా.... నీకు తప్పకుండా వేషం ఇస్తాను అన్నారు. నేను బిఏ పాసై సినిమా ఇండస్ట్రీకి వెళితే...మాట తప్పకుండా వేషం ఇచ్చారు. ‘నేడు' అనే సినిమాలో కృష్ణగారి అబ్బాయి రమేష్ బాబుగారు హీరో అయితే నాకు సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా 110 రోజులు చాలా బ్రహ్మాండంగా ఆడింది అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు

ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు

మద్రాసు వెళ్లిన నన్ను నీ కులం ఏమిటి? నీ మతం ఏమిటనిగానీ, అసలునువ్వు ఎవరు అని గాని ఏమీ అడగకుండా... నాలోని పిచ్చిని గమనించి ఈ రోజు నన్ను మీ ముందు నటుడిగా నిలబడేలా చేశారు. ఆ మహానుభావుడికి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. నన్నే కాదు నాలా చాలా మందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు అని నారాయణ మూర్తి తెలిపారు.

అన్నింటిలోనూ సక్సెస్

అన్నింటిలోనూ సక్సెస్

ఆయన సినిమా దర్శకుడిగా, నటుడిగా సక్సెస్ అయ్యారు. పత్రిక అధిపతిగా తన సత్తా చాటారు. రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో సేవ చేశారు అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి ఏమిటి.

ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి ఏమిటి.

ఓ పెద్దలారా... ఈరోజుల్లో ఒక పది కోట్లు ఉంటే హీరో అవ్వొచ్చు. వాళ్ల అబ్బాయిని హీరో చేయాలని పది కోట్లు పెట్టడంలో తప్పేమీ లేదు. వారసత్వంలో కూడా తప్పేమీ లేదు. వాళ్లు హీరోలు అవ్వొచ్చు... అవ్వాలికూడా. అందరూ అవ్వాలి. అయితే ఈ భారత దేశంలోగానీ ఈ ప్రపంచంలోగానీ ఓ సినిమాలో ఎంటరవ్వాలనే ఓ యాంబిషన్ డబ్బున్న వాడిది మాత్రమే కాదు. అంబేద్కర్ రిజర్వేషన్లు ఎలాగైతే పెట్టాడో మా లాంటి పేద వారందరికీ యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్లు అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసరి నారాయణ రావుగాను ఎలాగైతే కృషి చేశారో... అలాగే ఇపుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్యులు ఎవరైనా వస్తే కూడా దయచేసి వాళ్లకి కూడా వేషాలు ఇస్తూ వారి యాంబిషన్ తీరుస్తూ... అసలు సిసలు నివాళి దాసరి నారాయణ రావుకు ఇవ్వాల్సిందిగా పెద్దలు చిరంజీవిగారు, అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాసరావు గారి లాంటి పెద్దలను కోరుతున్నాను.... అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

దాదా ఫాల్కే అవార్డు ఇవ్వాలి

దాదా ఫాల్కే అవార్డు ఇవ్వాలి

భారత రత్న అవార్డు అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన గురువు గారు దాసరి నారాయణ రావు గారికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఫిల్మ్ చాంబర్ రికమండ్ చేసి బాబా సాహెబ్ పాల్కే అవార్డు ఇప్పించాలి అని నారాయణ మూర్తి తెలిపారు.

పరమ దుర్మార్గం

పరమ దుర్మార్గం

ఈ రోజుల్లో అవార్డులను కూడా లాబీయింగ్ చేసుకోవాల్సి వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా తెలుగు నుండి పద్మభూషణ్ రాలేదు. దాసరి నారాయణ రావు గారి విషయంలో రికమండ్ చేయాల్సిందే. విద్యా బాలన్ కు పద్మశ్రీ ఒక సినిమాతో ఇచ్చేశారు. సావిత్రి లాంటి మహా నటిని ఈ ప్రపంచంలో మనం చూశామా? ఎస్వీ రంగా రావుగారి లాంటి మహానటుడిని ఈ ప్రపంచంలో చూశామా? వాళ్లకి పద్మశ్రీలు లేవు. ఎంత దుర్మార్గమండీ ఇది అని నారాయణ మూర్తి అన్నారు.

ఎవడబ్బ సొమ్ము ఇది.... సౌతిండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే

దాసరి నారాయణ రావుగారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేయాలి. అంతా కలిసి ఢిల్లీ వెళదాం. సౌతిండియా, నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడబ్బ సొమ్ము ఇది. ఎవడబ్బ సొమ్ము భాయ్? అన్నీ వాళ్లకేనా? ఇండియా అంటే నార్త్ ఇండియానా? అంటూ ఆర్ నారాయణ మూర్తి ఉద్వేగంగా ప్రసంగించారు.

English summary
Dasari Santhapa Sabha got interesting with the controversial comments made by R Narayana Murthy. He said that Padma Shri & Padmabhushan awards are being sold and we need to get Bharatha Ratna award in a genuine way. Like Pawan Kalyan, the red films star has also highlighted the North India vs South India Divide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu