twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పీపుల్స్‌ వార్‌'లో ఆర్‌.నారాయణమూర్తి

    By Srikanya
    |

    విప్లవ చిత్రాల దర్శక, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి మరో చిత్రం ప్రకటించారు. 'పీపుల్స్‌వార్‌'టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఈ నెల 27 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. సోంపేట, బీల పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేయనున్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట థర్మల్‌ ఉద్యమం నేపథ్యంగా సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. ఇందుకు సంబంధించి ఉద్యమకారులు, ప్రజల అనుభవాల్ని తెలుసుకుంటున్నాను.స్వాతంత్య్రం వచ్చిన తరవాత ప్రజలు సాగించిన గొప్ప ఉద్యమం సోంపేటలో జరిగింది. ఇది మార్గదర్శకమైనది. అందుకే ఓ కళాకారుడిగా సామాజిక బాధ్యతతో సినిమా తీయబోతున్నాను అన్నారు.

    ఇక ఆయన బుధవారం సోంపేట, బీల ప్రాంతాల్లో పర్యటించారు. ఇక మొన్న 31న ఆయన 'పోరు తెలంగాణ'సినిమాని మరోసారి విడుదల చేసారు. 'దూకుడు' లాంటి పెద్ద చిత్రాల మధ్య నా సినిమా నలిగిపోయింది. అందుకే నా 'పోరు తెలంగాణ'సినిమాని మరోసారి విడుదల చేస్తున్నా. నైజాంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆ చిత్రాన్ని విడుదల చేసారు. అలాగే ఇప్పటికే పలు సమస్యలపై సినిమాలు తీశాను. ఓ కళాకారుడిగా భావ ప్రకటనా స్వేచ్ఛనాకుంది. అందుకే తెలంగాణ ఉద్యమంపై కూడా సినిమా తీశాను అని చెప్పారు.

    English summary
    R Narayana Murthy makes a film on Dharmal Power Plant movement titled Peoples war. He produces, directs and acts in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X