»   » ఆర్ నారాయణమూర్తి కొత్త చిత్రం అన్నదాత సుఖీభవః

ఆర్ నారాయణమూర్తి కొత్త చిత్రం అన్నదాత సుఖీభవః

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్నదాత సుఖీభవ: అనే కొత్త సినిమాను రూపొందిస్తున్నట్టు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల బాధలను కథాంశంగా చేసుకొని సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు.

R Narayana Murthy new movie is Annadata Sukhibhava

పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దేశానికి ఇది మంచిది కాదు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు రైతుల సంక్షేమంపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. రైతుల ఆత్మహత్యలకు కారణం దళారులే అని ఆయన ఆరోపించారు.

R Narayana Murthy new movie is Annadata Sukhibhava

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. రైతుల కష్టాలను తెరమీద ఆవిష్కరిస్తాం అని ఆయన అన్నారు. దేశంలో అన్నదాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏపీలో నదులు అనుసంధానం చేయాలని సూచించారు. జీఎస్టీలో రైతుల సంక్షేమం గురించి ప్రధాని మోదీ ఆలోచించలేదు అని ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు.

English summary
Popular Tollywood film personality R Narayana Murthy latest movie is Annadata Sukhibhava. The movie plot is based on farmers suicides. He requested Governments to take up farmers welfare schemes. He asked to eliminate the dalari system in agriculture sector.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X