»   » ఆంధ్రోడినైనా తెలంగాణాకు...ఆర్ నారాయణమూర్తి

ఆంధ్రోడినైనా తెలంగాణాకు...ఆర్ నారాయణమూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమం కాబట్టి ఆంధ్రోడినైనా తెలంగాణాకు జై కొడుతున్నానని సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాగణంలో ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఆదివారం తెలంగాణ జాతర, ఆట-పాట-మాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాతరలో ఆర్. నారాయణ మూర్తి ముఖ్య ప్రసంగం చేసారు. న్యాయమైన ఉద్యమం కాబట్టి ఏ ప్రాతం వారైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ఇవ్వాలని పేర్కొన్నారు. దోపిడీ ఉన్నచోట తిరుగుబాటు, ఉద్యమం, నక్సలిజం కచ్చితంగా ఉంటాయన్నారు. తెలంగాణ అడగటమే నక్సలిజమైతే ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు నక్సలైటే అన్నారు. ప్రస్తుతం ఆర్. నారాయణ మూర్తి ...వీర తెలంగాణా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలగా నారాయణ మూర్తి సినిమాలకు నైజాం ఏరియాల్లో ఎక్కువ డిమాండు అన్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu