twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరం కాదది.. శాపం

    By Staff
    |

    R Narayana Murthy
    అంటున్నారు విప్లవచిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన ఆర్‌.నారాయణమూర్తి. పై తరగతి టిక్కెట్‌ ధరను 50 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు ఆయన ఆ విధంగా స్పందించారు. ఈ పెంపు చిత్ర పరిశ్రమకు వరం కాదనీ, శాపమనీ నటుడు, దర్శక నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి విమర్శించారు. ఈ పెంపు అమానుషమని ఆయన ఆరోపించారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ "టికెట్‌ ధరలు పెంచేముందు నిబంధనల ప్రకారం థియేటర్లలో నేల, బెంచీ టిక్కెట్లు 60 శాతం వుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది పెద్ద మనుషులు కబ్జాచేసి నేల, బెంచీ సీట్లను 15 శాతానికి పరిమితం చేశారు.

    సినిమా మీద ఆసక్తి వుండే దిగువ తరగతి ప్రేక్షకులు కింది స్థాయి టిక్కెట్లు తక్కువగా వుండటంతో పైస్థాయి టిక్కెట్లను కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారమంతా సామాన్యుల మీదనే పడుతోంది. మా సినిమాలకు ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. టిక్కెట్‌ రేట్లు పెరగటం వల్ల ఇప్పటికే అధికంగా వున్న థియేటర్‌ అద్దెలు మరింతగా పెరిగే ప్రమాదముంది. ఇదివరకు పర్సంటేజి విధానం అమల్లో వున్నప్పుడు పరిశ్రమ కళకళలాడుతూ వుండేది. నేడు కొంతమంది గుత్త పెట్టుబడిదార్లు కబ్జాచేసి, థియేటర్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు.

    అద్దెలను విపరీతంగా పెంచేశారు. ఫలితంగా 80 శాతం నిర్మాతలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నిర్మాతల్లోని ఒక వర్గమే ఈ టిక్కెట్‌ ధరల పెంపుకు కారణం. నిజంగా వాళ్లు పరిశ్రమ మేలు కోరేవాళ్లయితే ముందుగా థియేటర్లలోని నేల, బెంచీ సీట్లను 60 శాతానికి పెంచాలి. టిక్కెట్‌ ధరల పెంపు విషయమై తీసుకు రావాలనుకుంటున్న జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతేకాక, థియేటర్ల అద్దె విధానం మీద అది దృష్టిపెట్టాలి. సీట్ల పర్సంటేజి సక్రమంగా వుండేలా చర్యలు తీసుకోవాలి'' అని ఆయన డిమాండ్‌ చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X