twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడు నన్ను అన్యాయం చేశాడు: ఆర్.నారాయణ మూర్తి

    By Srikanya
    |

    R. Narayana Murthy
    హైదరాబాద్ : ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. అప్పుడనిపిస్తుంది. 'నిజంగా తోడు తోడే' అని. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను చూడండీ... అప్పుడనిపిస్తుంది. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా అని. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు... అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. 'దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేశాడు. ఈ ఒక్క విషయంలో ఎందుకు అన్యాయం చేశాడు' అనుకుంటుంటా అంటూ చెప్పుకొచ్చారు ఆర్.నారాయణ మూర్తి. ఓ పాపులర్ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే... ఒక్కోసారి ఇంటి టైర్రస్ పై కూర్చుంటా. రెండు పక్షులు ఎగరడం నాకంట పడితే... వాటివంకే చూస్తుంటా. 'వాటికీ ఓ గూడు ఉండి ఉంటుంది. చివరకు అడవిలో తిరిగే మృగాలకు కూడా తోడూ, నీడా ఉంటాయి. మరి నా కెందుకు లేవు. పిచ్చోణ్ణి... నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు' అని బాధపడ్డ సందర్భాలు కోకొల్లలు. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఒక్కటే. 'మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్లి చేసుకుంటాం' అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కని సమాజానికి నాంది పలకండి. పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అన్నారు.

    ఇక తనెందుకు పెళ్లెందుకు చేసుకోలేదో చెప్తూ... వయసొచ్చినప్పట్నుంచీ ఉద్యమాలే ఊపిరిగా బతికా. నడుస్తున్న సూరీడులా ఉండేవాణ్ణి. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి. అవి నా భావాలకు అనుగుణంగానే ఉండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా. పెళ్లి అవసరం అప్పటికంటే.. ఇప్పుడే ఎక్కువని నాకు తెలుసు. కానీ... 60 ఏళ్లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే మనసులో లేదు అన్నారు.

    మరి ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఎవర్నీ ఇష్టపడలేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ... ఉహ తెలిసినప్పట్నుంచీ అనేక మంది అమ్మాయిల్ని చూసి ఇష్టపడతాం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని చూసి ఇష్టపడతారు. అది కామన్. అయితే.. ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. వాటిని గౌరవించుకోవాలి. గౌరవించకపోతే నేను 'నిర్భయభారతం' తీయడంలో అర్థం లేదు అని చెప్పుకొచ్చారు.

    English summary
    R. Narayana Murthy is a popular film director and producer of Telugu films or Tollywood. Masses call him peoples star, red star or revolutionary star but he has set a trend with his ‘red’ or communist revolutionary brand films that expose the exploitation done to the lower strata of the society. Narayana Murthy did not marry for the suspicion that his partner would oppose his path of action. He leads a very simple life style and even does not own a car unlike other producers who own many cars. He even eats with the common people as a common man in the local small hotels in hyderabad. He is a real inspiration for his simplicity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X