For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్.నారాయణ మూర్తి మీదుగా పవనిజం సాంగ్ లాంచ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : నిజమే.. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి చేతుల మీదుగా... పవనిజం సాంగ్ ఈ రోజు విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సినిమా ‘రేయ్'. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పై ‘పవనిజం' అంటూ సాగే ఓ పాటని కంపోజ్ చేసారు. ఈ పాటని ఈ రోజు సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేయనున్నారు. అది కూడా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా లాంచ్ చేయనుండటం విశేషంగా మారింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  వైవీఎస్‌ చౌదరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించారు. సయామీ ఖేర్‌, శ్రద్ధా దాస్‌ హీరోయిన్స్. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  ''కథ రీత్యా తొలి సగభాగం సినిమా కరేబియన్‌ స్త్టెల్‌లో ఉండాలి. విశ్రాంతి తర్వాత సన్నివేశాలు హాలీవుడ్‌ చిత్రాల్ని గుర్తుకు తెచ్చేలా ఉండాలి. అందుకే హీరో,హీరోయిన్స్ లు ధరించే దుస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. అందుకోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టాం'' అన్నారు వైవియస్ చౌదరి.

  R Narayana Murthy to release Pawanism song

  వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 'ధూమ్‌' సిరీస్‌లో వెస్ట్రన్‌ స్త్టెల్‌ కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌కు ఎంత పేరొచ్చిందో... తెలుగులో ఆ గుర్తింపు 'రేయ్‌'కు లభిస్తుంది. తొలి సగ భాగం వెస్టిండీస్‌ నేపథ్యంలో... రెండో సగభాగం అమెరికాలో సాగే ఈ చిత్రం కోసం ఎంతో పరిశోధన చేసి వస్త్రాల్ని డిజైన్‌ చేశాం. లాస్‌వేగాస్‌, న్యూయార్క్‌, లాస్‌ ఏంజిలెస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, బ్యాంకాక్‌, మలేసియా, తిరువూరు తదితర ప్రాంతాలు తిరిగి దుస్తుల్ని కొనుగోలు చేశాం. ఆ ఫ్యాషన్‌ల ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఒక హాలీవుడ్‌ చిత్రాన్ని చూస్తున్నామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది'' అన్నారు.

  వైవియస్ చౌదరి చిత్రం 'రేయ్‌' పూర్తి అయ్యి చాలా కాలం అయినా విడుదల కాలేదు. సాయి ధరమ్ తేజ చేసిన రెండో చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం విడుదల అయ్యింది కానీ ఫైనాన్సియల్ కారాణాలతో 'రేయ్‌' ఆగిపోయింది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్ధితిలో ఉన్న ఆ ప్రాజెక్టు గురించి చాలా రోజుల తర్వాత వైవియస్ చౌదరి మీడియాతో మాట్లాడారు.

  వైవియస్ చౌదరి మాట్లాడుతూ '''రేయ్‌' విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా కష్టపడ్డా. ఈ సినిమా విడుదల విషయంలో నాకు శక్తిని ప్రసాదించమని ఎన్టీఆర్ ని ప్రార్థించా. అందరి సహకారంతో త్వరలోనే 'రేయ్‌' చిత్రాన్ని విడుదల చేస్తాను. ఎన్టీఆర్‌ నా దేవుడు. నన్ను పై నుంచే ఆయన దీవిస్తుంటారని నా నమ్మకం. ఎలాంటి కష్టం వచ్చినా ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి 'అన్నా...' అని వేడుకొంటా''అన్నారు.

  నాకై ఓ సొంత సినిమా బ్యానర్‌ ‘బొమ్మరిల్లు వారి'ని స్థాపించాను. పైనుండి ఆయన ఆశీస్సులు నాకుంటాయని నమ్మకం. ‘రేయ్‌' సినిమా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే నా టీమందరి సహకారంతో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను.'' అని చెప్పారు.

  ''రేయ్‌.. రామ్‌చరణ్‌ కోసం రాసుకొన్న కథ. అయితే సాయిధరమ్‌తేజ్‌లో ఒకప్పటి చిరంజీవిగారి పోలికలు కనిపించాయి. అందుకే తనతో ఈ సినిమా తెరకెక్కించా'' అంటున్నారు వైవీఎస్‌ చౌదరి. ఆయన నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌ జంటగా నటించారు. శ్రద్దాదాస్‌ కీలక పాత్రధారి.

  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''నాకు శిరీష్‌ ఎంతో సాయీ అంతే. చిన్నప్పటి నుంచీ తనకి సినిమాలంటే పిచ్చి. 'సాయిని హీరోని చేసేద్దామా?' అని చరణ్‌ని చాలాసార్లు అడిగా. 'వాడు బుద్ధిగా చదువుకొంటున్నాడు కదా.. వదిలేయ్‌' అన్నాడు. తీరా చూస్తే 'రేయ్‌' సినిమా చేసేశాడు. సాయిని హీరోగా మార్చిన వైవిఎస్‌ చౌదరికి కృతజ్ఞతలు'' అన్నారు. ''నా కష్టం వెనుక బన్నీ అందించిన సహకారం చాలా ఉంది. కుదిరితే వైవిఎస్‌ చౌదరితో మరో సినిమా చేస్తా'' అన్నాడు సాయిధరమ్‌ తేజ్‌.

  వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

  ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

  వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.

  అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

  English summary
  Sai Dharam Tej’s debut film ‘Rey’, the newly included Pawanism song will be launched by none other than People’s Star R Narayana Murthy today at 6 PM.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X