»   » వచ్చే నెలలో వీర తెలంగాణ వస్తోంది

వచ్చే నెలలో వీర తెలంగాణ వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్‌.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో రూపొందిన 'వీర తెలంగాణ" చిత్రం వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం ఆయన ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియచేసారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ "మా స్నేహలత పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న 22వ చిత్రమిది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన నాలుగువేల మంది అమరవీరులకు అంకితమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాను. కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు", రాజ్‌ కుమార్‌ సంతోషికి 'భగత్‌ సింగ్‌" చిత్రాలు ఎలాగో అలాగే నాకు ఈ 'వీర తెలంగాణ" అవుతుంది. అతి త్వరలో ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. విజయ రంగరాజా, ఫుర్ఖాన్‌ అహ్మద్‌, వేద వ్యాస్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో, స్వరల్పనలో రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణ సాయుధ పోరాట సన్నివేశాల ఆధారంగా తెరకెక్కుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu