సందీప్ కిషన్ "రారా కృష్ణయ్య'' మోషన్ పోస్టర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎస్.వి.కె. సినిమా పతాకంపై సోలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న రారా కృష్ణయ్య చిత్రానికి మహేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సందీప్ కు అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ వీడియో మీకు అందిస్తున్నాం.

నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఉంటుంది. లక్ష్యం సినిమాలో గోపిచంద్ అన్నగా నటించిన జగపతిబాబు మళ్ళీ ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన కమిట్ అయిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలస్తుంది. అన్నారు.

Ra Ra Krishanyya's motion poster launched

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ... ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. ఓ అందమైన ప్రేమకథకు సరికొత్త నేపథ్యంలో చిత్రీకరణ ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, అమ్మాయి అమ్మాయి ప్రేమ ప్రయాణం, ఆ ప్రయాణంలో వారు పొందిన అనేక మధురానుభూతుల సమ్మేళనమే ఈ చిత్రమని, ప్రతీ సన్నివేశం వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

కల్యాణి, తనికెళ్లభరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తా.రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: అచ్చు, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7WaYxu1Iq_I?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X