»   » ప్లాన్ సక్సెస్: రెజీనా ముద్దు సీన్ వల్లే...

ప్లాన్ సక్సెస్: రెజీనా ముద్దు సీన్ వల్లే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్ కిషన్, రెజీనా జంటగా తెరకెక్కిన 'రారా కృష్ణయ్య' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. సినిమాలో కొత్తదనం లేక పోవడం...రొటీన్ కథాంశం, సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ కూడా పెద్దలేక పోవడమే ఈ ఫలితాలకు కారణం. 'తేరే నాల్ లవ్ హో గయా', 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్' చిత్రాల మాదిరిగా ఈ చిత్రం ఉండటం మరో కారణం.

అయితే ఈచిత్రంలో హీరో సందీప్ కిషన్ కన్నా...హీరోయిన్ రెజీనా పెర్ఫార్మెన్స్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. సినిమా మొత్తం తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక రెజీనా, సందీప్ కిషన్ మధ్య చిత్రీకరించిన లిప్ లాక్ ముద్దు సీన్‌ సినిమాకు హైలెట్ అయింది. వాస్తానికి సినిమాలో కేవలం ఈ మద్దు సీన్ ఉండటం వల్లనే సెన్సార్ బోర్డు సభ్యులు 'A' సర్టిఫికెట్ ఇచ్చారు.

'Ra Ra Krishnayya' lip lock a hit

ఆ సీన్ తీసేస్తే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పినా....దర్శక నిర్మాతలు రాజీ పడలేదు. ఆ ముద్దు సీన్ ఉండటానికే మొగ్గు చూపారు. వారు అనుకున్నట్లు ఈ ముద్దు సీన్ సినిమాకు హైలెట్ అయింది. తెలుగు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటికంటే ఈ ముద్దే సీన్ చాలా బాగుందనే టాక్ బయట వినిపిస్తోంది.

అంతంత మాత్రం కలెక్షన్లతో నడుస్తున్న 'రారా కృష్ణయ్య' ఈ ముద్దు సీన్‌ను అడ్డు పెట్టుకుని మినిమం గ్యారంటీతో బయట పడుతుందో? లేదో? వేచి చూడాలి. యస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా మహేష్‌బాబు.పి. దర్శకుడిగా పరిచయమయ్యారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శ్రీరామ్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, సంగీతం: అచ్చు.

English summary
Regina and Sundeep Kishan's lip lock scene is getting superb response from the masses and the director made sure to hold the best scene of his 'Ra Ra Krishnayya' until the climax.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu