‘రారా కృష్ణయ్య’ పెద్దలకు మాత్రమే!
హైదరాబాద్: సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య' చిత్రం సెన్సార్ కార్య్రమాలను పూర్తి చేసుకునింది. ఈచిత్రానికి సెన్స్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలై 4 న విడుదల కానుంది.
ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. జగపతిబాబు ఈ చిత్రంలో హీరో అన్నగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ....
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.

జగపతి బాబు
లక్ష్యం సినిమాలో గోపిచంద్ అన్నగా నటించిన జగపతిబాబు మళ్ళీ ఈ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న జగపతిబాబు లెజెండ్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించినసంగతి తెలిసిందే.

సందీప్ మాట్లాడుతూ...
ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు అన్నారు.

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. జగపతిబాబు, అల్లరి రవిబాబు, తనికెళ్ళ భరణి,బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ , నల్లవేణు, సత్యం రాజేష్, శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు.


Click it and Unblock the Notifications











