»   » సందీప్‌ కిషన్ 'రారా కృష్ణయ్య' రిలీజ్ ఎప్పుడు?

సందీప్‌ కిషన్ 'రారా కృష్ణయ్య' రిలీజ్ ఎప్పుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఎస్వీకే సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో విడుదల కానుందని నిర్మాత తెలియచేసారు. జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మీడియా సమావేసం హైదరాబాద్‌లో జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత.

సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. ప్రస్తుతం గణేష్ మాస్టర్ నృత్యదర్శకత్వంలో క్లైమాక్స్ పాటను చిత్రీకరిస్తున్నాం. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

 'Ra Ra Krishnayya' to release in March

నిర్మాత మాట్లాడుతూ "మా సంస్థలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో ఆడియో, వచ్చే నెల్లో సినిమాను విడుదల చేస్తాం. సందీప్ సోదరుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది'' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "జగపతిబాబు రోల్ సినిమాకు హైలైట్ అవుతుంది. మా నిర్మాత కథను నమ్మి అవకాశమిచ్చారు'' అని తెలిపారు. మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని రెజీనా, కాశీ విశ్వనాథ్, గణేష్ అన్నారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శ్రీరామ్, ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు.

English summary
Ra Ra Krishnayya starring Sundeep Kishan is gearing up for release in March. Jagapathi Babu plays the role of Sundeep’s brother in this film. His role is very crucial for the film. This film is directed by Mahesh Babu P.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu