‘మగధీర’ కాపీ వివాదం.... అల్లు అరవింద్‌పై మండిపడ్డ నిర్మాత

‘రబ్తా’ నిర్మాత భూషణ్ కుమార్ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ‘రబ్తా’ స్టోరీ ఏ సినిమాకు కాపీ కాదని, సొంతగా తయారు చేసిందే అని తెలిపారు. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి ఇది తాము కాపీ కొట్టామనే అ

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రబ్తా' సినిమా తెలుగులో ఇప్పటికే వచ్చిన 'మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టి తీసారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మగధీర నిర్మాతలు అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు. సినిమా ముందు తమకు చూపించాలని, అప్పటి వరకు సినిమాను విడుదల ఆపివేయాలని తమ పిటీషన్లో కోరారు.

ఈ వివాదంపై 'రబ్తా' నిర్మాత భూషణ్ కుమార్ స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. 'రబ్తా' స్టోరీ ఏ సినిమాకు కాపీ కాదని, సొంతగా తయారు చేసిందే అని తెలిపారు. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి ఇది తాము కాపీ కొట్టామనే అభిప్రాయాణికి రావడం ఏమిటని మండిపడ్డారు.

అలాంటి ఉద్దేశ్యం ఎవరికీ లేదు

ఒకరి సినిమా కాపీ కొట్టాలనే ఉద్దేశ్యం కానీ, అలాంటి ఐడియాలజ కానీ తమకు లేదని.... క్రియేట్ ఐడియాలజీ ఆధారంగానే సినిమాలు తీస్తామని భూషణ్ కుమార్ అన్నారు. కోర్టు నుండి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.

జూన్ 1న కేసు తీర్పు

జూన్ 1న కేసు తీర్పు

అల్లు అరవింద్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. కాగా జూన్ 9 'రబ్తా' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

రబ్తా

రబ్తా

రబ్తా చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ చిత్ర దర్శకుడు ‘కాక్ టెయిల్' లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. బద్లాపూర్, హ్యాపీ ఎండింగ్, ఫైండింగ్ ఫన్నీ, గో గోవా గాన్, ఏజెంట్ వినోద్, లవ్ ఆజ్ కల్, హైజాక్, బీయింగ్ సైరస్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

హాట్ సీన్లు

హాట్ సీన్లు

ఇక సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ మధ్య రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు జోరుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత హాటుగా, ఘాటుగా క్రితి సనన్ గతంలో ఎప్పుడూ, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X