»   » మగధీర vs రబ్తా కాపీరైట్ కేసు: 100 సినిమాల లిస్టు సమర్పించిన లాయర్

మగధీర vs రబ్తా కాపీరైట్ కేసు: 100 సినిమాల లిస్టు సమర్పించిన లాయర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'రబ్తా' చిత్రం మగధీరను కాపీ కొట్టి తీసారంటూ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 6, 7వ తేదీల్లో ఈ కేసు విషయమై ఇరు పక్షాల మధ్య దాదాపు 5 గంటల పాటు వాదనలు జరిగాయి.

'రబ్తా' సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్, స్టోరీ లైన్, విలన్ రోల్, ఫారిన్ లొకేషన్స్, సినిమా క్లైమాక్స్ పూర్తిగా డిఫరెంట్ అని 'రబ్తా' నిర్మాతల తరుపు లాయర్ వాదించారు. మగధీర సినిమాలో హీరో 100 మందిని చంపే సీన్ 'రబ్తా' సినిమాలో ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను తోసి పెచ్చారు. తమ సినిమాలో గానీ, ట్రైలర్లో గానీ అలాంటి సీన్ లేదని వాదించారు.

మగధీర సినిమాకు పూర్తిగా విభిన్నం

తమ ‘రబ్తా' మూవీ మగధీర సినిమాకు పూర్తిగా భిన్నమైందని.... ఇందులో విలన్ రోల్ పూర్తిగా విభిన్నంగా ఉంటుందని, సినిమాలో హీరో కూడా నెగెటివ్ పాత్రలో కనిపిస్తాడని ‘రబ్తా' నిర్మాతల లాయర్ వాదించారు.

గతజన్మ, పునర్జన్మ నేపథ్యం

గతజన్మ, పునర్జన్మ నేపథ్యం

ఇద్దరు ప్రేమికుల గతజన్మ, పునర్జన్మ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయని, తమ సినిమాలో అలాంటి నేపథ్యం వాడినంత మాత్రాన మగధీర సినిమాను కాపీ కొట్టినట్లు కాదని వాదించిన లాయర్.... ఇలాంటి గత జన్మ కాన్సెప్టుతో వచ్చిన దాదాపు 100 సినిమాల లిస్టును కోర్టుకు సమర్పించారు.

ఇది సరైన పద్దతి కాదు..

ఇది సరైన పద్దతి కాదు..

కేవలం ‘రబ్తా' సినిమాకు సంబంధించిన 2 నిమిషాల ట్రైలర్ చూసి 2.30 గంటల పాటు సాగే సినిమాను అంచనా వేయడం ఎలా సాధ్యం? కేవలం దీన్ని చూసి సినిమా మొత్తం కాపీ అని మమ్మల్ని బ్లేమ్ చేయడం సరైన పద్దతి కాదని రబ్తా నిర్మాతలు వాదిస్తున్నారు.

నేడు తుది తీర్పు

నేడు తుది తీర్పు

మగధీర, రబ్తా సినిమా వివాదంలో కొనసాగుతున్న వాదనలపై కోర్టు ఈరోజు (జూన్ 8)న తుది తీర్పు ఇవ్వనుంది. మరికొన్ని గంటల్లో ఈ కేసు ఎటో ఒక వైపు తేలనుంది. జూన్ 9న సినిమా విడుదల కావాల్సి ఉంది.

మరో వివాదం...

మరో వివాదం...

ఓ వైపు రబ్తా సినిమా మగధీర చిత్రానికి కాపీ అంటూ ప్రచారం జరుగుతుంటే..... మగధీర చిత్రం కూడా కాపీ కొట్టింది తీసిందే అంటూ ఆరోపణలు చేశారు. గతం లో అసలు మగధీర కథే నా కథకు కాపీ అంటూ ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన ప్రముఖ రచయిత ఎస్పీ చారీ ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చారు. 1998 లో ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చీన కథే చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో తెరకెక్కించారని ఎస్పీ చారీ ఆరోపించారు. అప్పట్లో ఆంధ్ర భూమిలో సీరియల్ గా వచ్చిన కథని చాలామందే చదివినా మగధీర సమయం లో పాపం చారీ గారికి సపోర్ట్ గా ఎవ్వరూ రాలేదు. అలా ఫిలిం చాంబర్ కూడా ఆయన ఫిర్యాదుని సీరియస్ గా పట్టించుకున్నవాళ్ళే లేరు.

రబ్తా

రబ్తా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, క్రితి సనన్ జంటగా నటించిన రబ్తా చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ చిత్ర దర్శకుడు ‘కాక్ టెయిల్' లాంటి హిట్ చిత్రాన్ని అందించారు. బద్లాపూర్, హ్యాపీ ఎండింగ్, ఫైండింగ్ ఫన్నీ, గో గోవా గాన్, ఏజెంట్ వినోద్, లవ్ ఆజ్ కల్, హైజాక్, బీయింగ్ సైరస్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

English summary
Makers of Raabta argued for over 5 hours in court yesterday and today (June 6 and June 7) citing several differences in the script and storyline of their film Raabta and Magadheera. The final verdict on the case will be out today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu