»   » 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ఫొటో ఇంకోటి

'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ఫొటో ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ..గబ్బర్ సింగ్ షూటింగ్ లో రాయ్ లక్ష్మి బాగా ఎంజాయ్ చేస్తునట్లు కనపడుతోంది. తాజాగా ఆమె తన ఫ్యాన్స్ కోసం సర్దార్ షూటింగ్ లోని ఓ ఫొటో ని ట్విట్టర్ ద్వారా అప్ లోడ్ చేసింది. ఆ ట్వీట్ ని ,ఫొటోని మీరు చూడండి.


ఇక ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ , కొన్ని సీన్స్ చేయబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఓ పాట అదిరిపోనుందని, ఆ పాట పెద్ద హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ నానక్ రామగూడ లో ఈ సాంగ్ షూట్ జరగింది. ఈ పాట కోసం ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మకడలి సెట్స్ వేసారు. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించింది రాయ్‌ లక్ష్మి .


'కాంచనమాల కేబుల్‌టీవీ'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాలు చేసింది. ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి. లక్ష్మీ రాయ్‌గా పరిచయమైన ఆమె కొంతకాలం క్రితమే తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకొంది. పవన్‌తో కలిసి నటించే సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని వ్యాఖ్యానించింది.


నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.


English summary
"The eyes r useless,when the mind is blind ‪#‎selfieemood‬ ‪#‎shoot‬ ‪#‎julie2‬ ‪#‎bangalorenatkal‬ ‪#‎sardargabbarsingh‬ #2016 ‪#‎loving‬ it much love to all," the Raai Lakshmi shared it on her twitter
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu