»   » అటు పవన్ తో...ఇటు భోజపురి హీరోతో

అటు పవన్ తో...ఇటు భోజపురి హీరోతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకున్న లక్ష్మీ రాయ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సౌతిండాలో వరస పెట్టి చేస్తున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఇప్పటివరకు 49 సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తన 50వ సినిమాగా 'జూలీ-2'లో నటిస్తున్నారు.

2004లో దీపక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'జూలీ'కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ఆయనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 'రేసుగుర్రం' ప్రతినాయకుడు శివారెడ్డిగా నటించిన భోజ్‌పురి నటుడు రవి కిషన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Raai Laxmi (Lakshmi Rai) to don for 'Julie 2'

ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా 'జూలీ-2' సెట్స్‌లో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన వర్కింగ్‌ స్టిల్‌ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో రాయ్‌ లక్ష్మి బికినీలో కనిపించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

On the sets of #julie2 #songshoot #50thfilm dancing with bhojpuri star Ravi Kishan n Ganesh achariya 󾌳

Posted by Raai Laxmi on6 December 2015

బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

‘జూలీ 2' చిత్రానికి కూడా దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహించబోతున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.

ఈ సంవత్సరం లక్ష్మీ రాయ్ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. ఈ అమ్మడు ఈ సంవత్సరం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఆమె అప్పట్లో ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ...‘సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం డాన్స్ కూడా చేయడం మీరు చూస్తారు' అని వెల్లడించారు.

English summary
Raai Laxmi is all set to make her debut in Bollywood and the film will be the 50th movie in her career. She will play the female lead in Bollywood movie "Julie 2" and will also be donning a bikini for the first time.
Please Wait while comments are loading...