»   » చాన్స్ కోసం పడుకొమ్మంటారు: మళ్ళీ వివాదం రేపిన లక్ష్మీరాయ్

చాన్స్ కోసం పడుకొమ్మంటారు: మళ్ళీ వివాదం రేపిన లక్ష్మీరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది.

తమతో పడుకోవాలని

తమతో పడుకోవాలని

.సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇలాంటివి ఎదుర్కొన్నాను. కొందరు దర్శకులు, హీరోలు తమతో పడుకోవాలని, అలా అయితేనే అవకాశాలిస్తామని ఒత్తిడి తెచ్చారని సౌథ్ హీరోయిన్ పార్వతీ మీనన్ డైరెక్ట్ గా చెప్పేసింది.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

ఇప్పుడు మళ్ళీ ఇదే అంశం పై లక్ష్మీ రాయ్ ఇంకో విషయం చెప్పింది. పెరిగిపోతున్న కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై నటీ నటులు నోరు విప్పుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పటానికి జంకటం లేదు. ముఖ్యంగా నటీమణులపై లైంగిక వేధింపులపై ఇటీవల మీడియాలో కథలు కథలుగా కథనాలు ప్రచారం జరుగుగుతున్నాయి.

ఇండస్ట్రీలో వేధింపులు

ఇండస్ట్రీలో వేధింపులు

రీసెంట్ గా అడ్జెస్ట్‌మెంట్‌ తప్పదంటూ ఇండస్ట్రీలో వేధింపులు గురించి నటి రెజీనా, ఒక ఛానల్‌ ప్రతినిధి మళ్లీ ఎప్పుడు కలుద్దామని అన్నారంటూ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను ఇలాంటి వేధింపులను ఎదర్కొన్నానంటూ నటి సంధ్య ఇలా ఇటీవల పలువురు హీరోయిన్స్ ఛేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడించడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాస్టింగ్ కౌచ్

కాస్టింగ్ కౌచ్

తాప్సీ పన్ను లాంటి హీరోయిన్ మాత్రమే కదు, రాధికా ఆప్టే, సుకన్య లాంటి తారలూ చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి సాగుతున్న....ఇప్పటికీ కొనసాగుతున్న నీచమైన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది 'కాస్టింగ్ కౌచ్'. హీరోయిన్ గా అవకాశం కావాలంటే తనతో పడుకోవాలని అడిగే దర్శకులు, తనకు సెక్స్ సుఖం అందించాలని కోరే స్టార్ హీరోలు, నిర్మాతలు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అంటూ చెప్పి ఇన్నాళ్ళూ ఓపెన్ సీక్రెట్ గా ఉండే వ్యవహారాన్ని రచ్చకీడ్చేసారు.

సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం

సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం

నిర్భయంగా అసలు సంగతి మీద తమకున్న వ్యతిరేకతని బాహాటంగానే బయటపెట్టారు. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం (స్లీప్‌ అరౌండ్‌) వస్తారు'' అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు రాయ్‌ లక్ష్మి.

సుఖాల కోసం

సుఖాల కోసం

‘‘తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు. 'ఫిలిం ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు నటీమణులతో పడుకునేందుకు ఉత్సాహం చూపుతుంటారు' అని ఓపెన్ గానే చెప్పేసింది. 'హీరోయిన్ల వ్యక్తిగత అవసరాలపై కూడా వీళ్లు బాగా దృష్టి పెడుతుంటారు.

టాలీవుడ్ ని మాత్రమే బ్లేమ్ చెయ్యకుండా

టాలీవుడ్ ని మాత్రమే బ్లేమ్ చెయ్యకుండా

ఇదంతా వారితో గడిపేందుకే' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లక్ష్మీ రాయ్.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం బాగానే నడుస్తోందని చెప్పి ఈ మంటలో ఇంకాస్త ఆజ్యం పోసేసింది. అయితే కొందరు హీరోయిన్ల లాగా కేవలం టాలీవుడ్ ని మాత్రమే బ్లేమ్ చెయ్యకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ పరిస్థితి ఉందీ అంటూ మొహమాటం లేకుండా చెప్పింది.

English summary
"some producers come to the industry just to gamble, have fun and sleep around. These people want actresses to sleep with them and if an actress doesn’t accept this condition, she is thrown out of the movie. No surprises for this revelation, anyway" said Raai Laksmi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu