For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అటు పియోనో, ఇటు జిమ్మాస్టిక్స్‌ నేర్చుకుంటోంది

  By Srikanya
  |

  చెన్నై: తమ పాత్రల కోసం హీరోలు సిక్స్ ప్యాక్ లు, జిమ్ లో గంటుల తరబడి గడపటం, ఫైట్స్ వంటి వాటిల్లో ప్రత్యేక శిక్షణ వంటివి తీసుకోవటం చేస్తూంటారు. మీరేనా...మేం చేయలేమా అంటూ ముందుకు దూకుతోంది...లక్ష్మీరాయ్...అదే రాయ్ లక్ష్మి. ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్‌ దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రంలో ఆమే హీరోయిన్. ఓ జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణిగా నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆమెకు పియోనో వాయించటం బాగా తెలుసుకుని అది ప్లే చేస్తున్న ఫొటో ఒకటి అప్ లోడ్ చేసింది.

  ఈ నేపథ్యంలో జిమ్మాస్టిక్స్‌పై అవగాహన పెంచుకోవడమే కాదు... ఓ కోచ్‌ వద్ద కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. చాలా ఎక్సైట్ మెంట్ గా ఉందని ఇలా నేర్చుకోవటం, అది సినిమాకు మాత్రమే కాదు...తనకు వ్యక్తిగతంగానూ పనికివస్తుందని చెప్తోంది. ఓ సినిమాలో పాత్రకోసం ఇంతగా కష్టపడుతున్న ఆమె తపనను అభినందించాల్సిందే.

  ఇక అందాల ముద్దుగుమ్మ... రాయ్‌లక్ష్మి(లక్ష్మీ రాయ్) ఎక్కడుంటే అక్కడ వార్తలకు, సంచలనాలకు కొదువ ఉండదు. అప్పట్లో కొంతమంది క్రికెటర్లతో కలిసి తిరిగిన ఈ భామ... మూడు నెలలుగా ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. ఆరాతీస్తే ఆమె ముంబాయిలో ఉన్నట్లు తేలింది. తదుపరి చిత్రం కోసం అందాలకు మెరుగులు దిద్దుకోవడం, ఆ పాత్రకు తగినట్లు కొన్ని అంశాల్లో శిక్షణ తీసుకునే పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.

   Raai Laxmi reveals her love for music

  పేర్లను ముందుకు, వెనుకకు మార్చుకోవడం నటీమణులకు కొత్త కాదు. లక్ష్మీరాయ్‌ కూడా ఇప్పుడు రాయ్‌ లక్ష్మీ అని పిలిపించుకుంటోంది. అలా ఎవరైనా తనను పిలిస్తే చాలా ఆనందంగా ఉందని చెబుతోంది.

  రాయ్‌ లక్ష్మీ మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు నా పేరు నిత్యం వార్తల్లో ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌ నా గురించి షికారు చేస్తుండేది. కానీ ఈ మధ్య ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. గాసిప్‌ రూమ్‌కి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా నా అభిమానులకు అందుబాటులో ఉన్నాను. నేను చెప్పాల్సిన వివరాలను స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇక గాసిప్స్‌కి తావుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాసిప్స్‌కి నేను ఛాన్స్‌ ఇవ్వట్లేదు'' అని చెప్పకొచ్చింది.

  తనకు నచ్చిన పాత్రల గురించి మాట్లాడుతూ ‘‘పూర్తిస్థాయి దెయ్యం సినిమాలో నటించాలని ఉంది. ఇతరులను ఎంటర్‌టైన్‌ చేయగలననే విషయం తెలుసు. కానీ, ఇతరుల్ని భయపెట్టగలనో లేదో టెస్ట్‌ చేయాలని ఉంది'' అని వివరించింది రాయ్‌.

  English summary
  Raai Laxmi riding high and has several high profile movies in her kitty. It is little wonder then that the actress hardly gets time to do pursue other interests. But she recently revealed something about herself that most people may not know. Raai posted a picture on her Instagram page of her playing a piano.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X