»   » న్యూడ్ గా నటించిందనే... పిచ్చిగా ఎదురు చూస్తున్నారట

న్యూడ్ గా నటించిందనే... పిచ్చిగా ఎదురు చూస్తున్నారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి మంచి మార్కులు కొట్టేసింది. కొంచెం ఆలస్యంగానే బాలీవుడ్ దృష్టిలో పడిన ఈ భామ .. 'జూలి 2' సినిమా చేసింది. గతంలో వచ్చిన 'జూలి'కి సీక్వెల్ గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు.నగ్నంగా నటించిందన్న వార్తలతో ఈ చిత్రం విడుదల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హాట్‌టాపిక్‌

హాట్‌టాపిక్‌

గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తోపాటు, ఇటీవలే విడుదలైన టీజర్‌లో రాయలక్ష్మి అందాల ఆరబోత ప్రస్తుతం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్‌ చిత్రం ఇదే కాగా, ఓవరాల్‌గా 50వ చిత్రం. ఐదు భాషల్లో గ్లామరస్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ పొడుగుకాళ్ల సుందరి ‘జూలీ2'పై భారీ ఆశలే పెట్టుకుంది.

బాలీవుడ్‌లోనే సెటిలైపోవాలని

బాలీవుడ్‌లోనే సెటిలైపోవాలని

ఈ సినిమా విజయం సాధిస్తే బాలీవుడ్‌లోనే సెటిలైపోవాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయలేదట. అంతేకాదు, బికినీ పోస్టర్‌పై రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో... అసలు బికినీ ధరించడంలో తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తోంది రాయ్ లక్ష్మీ.

ఐటెం సాంగులో చిందేసింది

ఐటెం సాంగులో చిందేసింది

చాలా సంవత్సరాల నుండి సౌత్ లో పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని చూసిన నార్త్ భామ లక్ష్మీ రాయ్.. అస్సలు బ్రేక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. చివరాకరగా రాయ్ లక్ష్మి అని పేరు మార్చుకుని మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 లో మెరిసిందీ అమ్మడు. కాకపోతే అక్కడేం పెద్దగా చేసిందీ లేదు. ఏదో అలా అలా ఐటెం సాంగులో చిందేసింది అంతే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతూ.. పూర్తి స్థాయి రోల్ ఒకటి చేస్తోన్న సినిమాతో.. భారీ ఆశలే పెంచుకుంది.

జూలీ'లో నేహాధూపియా కన్నా

జూలీ'లో నేహాధూపియా కన్నా

‘జూలీ1'లో నేహాధూపియా నటించిన దాని కన్నా ఎన్నోరెట్లు అందాల ఆరబోతతో ఆమె బాలీవుడ్‌ ప్రేక్షకులను కట్టిపడేయనికి రెడీ అవుతోంది. ఇందులో ఆమె హాట్‌ హట్‌గా అందాల విందు చేయనుందని సమాచారం. మొత్తానికి ఇలాంటి శృంగార చిత్రంలో ఆమె తనకు అవకాశం రావడంతో మంచి జోరుమీదుంది.

దేశవ్యాప్తంగా క్రేజ్‌

దేశవ్యాప్తంగా క్రేజ్‌

ఈ చిత్రం ఎలాగూ దక్షిణాదిలో కూడా విడుదల కావడం ఖాయం. దాంతో తనకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ వస్తుందనే ఆశతో ఉంది. మొత్తానికి దేనికైనా రెడీ అనే రాయ్‌ లక్ష్మీ కెరీర్‌ను ఈ చిత్రం టర్న్‌ చేస్తుందనే ఆశతో ఉంది. చూదాలి ఈ సినిమా తో అయినా రాయ్ లక్ష్మీ దశ మారుతుందేమో మరి.

English summary
Raai Laxmi aka Lakshmi Rai, who has donned bikinis in her upcoming movie Julie 2, has posted online a couple of pictures that reveal her look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu