»   »  మిడ్ నైట్ పార్టీ: ఇద్దరు హీరోయిన్లు, రవితేజ, వరుణ్ తేజ్ ఇంకా..(ఫోటో)

మిడ్ నైట్ పార్టీ: ఇద్దరు హీరోయిన్లు, రవితేజ, వరుణ్ తేజ్ ఇంకా..(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అర్థరాత్రి 12 గంటలకు కేక్ కటింగులు, స్నేహితులతో కలిసి పార్టీలు. తాజాగా రాశిఖన్నా పుట్టినరోజు వేడుక కూడా అలానే జరిగింది. ఈ రోజు రాశిఖన్నా బర్త్ డే. దీంతో ఆదివారం అర్థరాత్రి చిన్న బర్త్ డే పార్టీ అరేంజ్ చేసింది.

ఈ పార్టీకి ఆమెతో మాస్ మహరాజ రవితేజ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు శిరీష్,సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఓ సెల్పీ ఫోటోను రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

Raashi khanna birth day party pic

ప్రస్తుతం రాశి ఖన్నా రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్', సాయి ధరమ్ తేజ్ సరసన ‘సుప్రీమ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మదరాస్ కెఫే మూవీలో నటించి, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫోకస్ ని పెట్టింది. ఇంతలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి రాశి ఖన్నాకి ఆఫర్స్ రావటంతో, ఇక ఇక్కడే సెటిల్ అయిపోయింది.

సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో రాశిఖన్నా హైదరాబాదులో ఇటీవలే ఒక ఇల్లు కొనేసుకుంది. తన తన ఫ్యామిలీని కూడా హైదరాబాద్ కి షిప్ట్ చేసేస్తుంది. హిందీలో, కోలీవుడ్ లో తనకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అవుదామని నిర్ణయించుకుందట.

English summary
"Happppy budday to d most adorable, my love raashikhanna .. Have a superhit year! N may U alwaysss keep smiling! Muah" Rakul preet singh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu