»   »  రూ.50 లక్షలు పోగొట్టుకున్న హీరోయిన్!?!

రూ.50 లక్షలు పోగొట్టుకున్న హీరోయిన్!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
గతంలో అందాలతో జనాన్ని ఇబ్బందులు పెట్టిన రాశి పెళ్లి చేసుకున్న తరువాత స్వయంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటోంది. ఇంట్లో ఇల్లాలిగా హాయిగా కాలం గడపక సినీ నిర్మాతగా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ను పెళ్లాడిన రాశి తన భర్తను దర్శకుడిగా చూడాలనే ఉద్ధేశంతో మహారాజశ్రీ సినిమాను నిర్మించింది. పాత మిత్రుడు డిఎస్ రావుతో కలిసి ఈ సినిమాను రాశి నిర్మించింది. రిషి, నిఖిత హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా మొదటివారంలోనే కొట్టుకుపోయింది. ఈ సినిమా కోసం రాశి రూ.50 లక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. రాశి పరిస్థితి కుడితిలో పడ్డట్టయింది. మహారాజశ్రీ సినిమాకు దర్శకత్వమే బాలేదని విమర్శలు వస్తుండడంతో రాశి బాధ రెండింతలయింది. చూస్తేనేమో దర్శకుడు తన భర్త..డబ్బులు కూడా తనవే కావడంతో రాశి పరిస్థితి డబ్బులు పాయే...పేరు రాకపాయే అన్నట్టు తయారైంది. భర్త మీదున్న నమ్మకంతోనే కావచ్చు-ఇకముందు సినిమాలు నిర్మించనని మహారాజశ్రీ విడుదల కాకముందే రాశి స్పష్టంగా ప్రకటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X